బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఎయిర్పోర్ట్లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.
గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు. breaking…
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి.
నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్ ఒప్పందం…
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్ఎంలు నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. breaking news, latest news, telugu…
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీతా దహల్(69) బుధవారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తమ గగనతలాన్ని ఉల్లంఘించిన యూఎస్ గూఢచారి విమానాలను కూల్చివేస్తామని ఉత్తర కొరియా బెదిరించిన మరునాడే ఈ పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియా జపాన్ సముద్దం అని పిలవబడే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు.
నేడు ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి వర్గ పునర్వవ్యస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై పూర్తిగా కసరత్తు చేసిన ప్రధాని మోడీ మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది