సినిమాల్లోకి సితార ఎంట్రీ.. అన్ని చోట్లా కుళ్ళు ఉందంటూ నమ్రత కామెంట్స్
మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతుల కుమార్తె సితార ఈ మధ్యకాలంలో ఒక జ్యువెలరీ యాడ్ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయిలో నగలు ధరించిన ఆమె ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకంగా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ మీద కూడా ప్రిన్సెస్ సితార లిమిటెడ్ జువెలరీ ఎడిషన్ పేరుతో సితార ఫోటోలను కూడా ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది. అయితే సితార అడ్వర్టైజింగ్ వ్యవహారం మీద మాట్లాడేందుకు నమ్రతా శిరోద్కర్ తో కలిసి సితార మీడియా ముందుకు వచ్చింది. అలా వచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులు నమ్రత సమక్షంలోనే సితారకు సినీ పరిశ్రమలో రాణించాలని కోరిక ఉందా అని ప్రశ్నిస్తే దానికి సితార ఎక్సైట్ అవుతూ తనకు సినీ పరిశ్రమలోకి రావాలనే ఉద్దేశం ఉందని కామెంట్ చేసింది.
అయ్యా బాబోయ్.. తాతోయ్ నువ్వు ముసలాడివే కానీ..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంటాయి.. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వృద్దులు చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగచక్కర్లు కొడుతుంటాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూసే ఉంటారు.. తాజాగా మరో తాత తనలోని జోష్ ను.. తనలోని హీరోను బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారు.. అతని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఓ పెద్దాయన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు చూసి ఉంటారో.. వయసు మీద పడ్డా ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ‘కోయీ లడ్కీ హై’ అనే పాటకి హుషారుగా స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు… మనుషుల పెదాలపై చిరు నవ్వు తెప్పించే అద్భుతమైన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకదాని గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఓ గ్రూపు మగవారంతా కూర్చుని ఉన్నారు. ఓ పెద్దాయన ‘ దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘కోయి లడ్కీ హై’ అనే పాటకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా స్టెప్పులు వేశారు. ఆయన మొహంలో ఎంతో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు షేర్ చేశారు..
ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రా అమ్మాయి..
బ్యాంకాక్ లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ లో జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధించింది. జూలై 13న జరిగిన ఈ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ.. తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.
మరోవైపు మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచిన జ్యోతి యర్రాజీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. థాయ్‌లాండ్‌లో జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన వైజాగ్‌కు చెందిన మా స్వంత @జ్యోతియారాజీకి నా అభినందనలు మరియు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు. మీరు మా అందరినీ చాలా గర్వపడేలా చేసారు జ్యోతి! అని ట్విటర్ ద్వారా అభినందనల జల్లు కురింపించారు.
తాండూరు ఆర్టీసీ టికెట్ చెకింగ్ టీం అధికారుల వెహికిల్ లో చోరీ
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ అధికారుల చెకింగ్ వాహనంలో చోరీ జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన టీఎస్ఆర్టీసీకి చెందిన చెకింగ్ అధికారులు వికారాబాద్ జిల్లాలోని తాండురులో నిన్న (శుక్రవారం) రాత్రి 9.30 గంటలకు డిపోలో చెకింగ్ చేసినట్లు పేర్కొన్నారు. చెకింగ్ అనంతరం రాత్రి 10 గంటల సమయంలో భోజనం చేసేందుకు డిపో పక్కనే ఉన్న హోటల్ కు వెళ్లారు. అయితే, అధికారులు భోజనం చేసేందుకు వెళ్లడం చూసిన దుండగులు పార్కింగ్ చేసిన వాహనంలో నుంచి ఓ బ్యాగ్ ను కొట్టేసినట్లు గుర్తించి.. వెంటనే ఆర్టీసీ అధికారులు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము ఖమ్మం జిల్లాకు చెందిన చెకింగ్ టీమ్ శుక్రవారం రాత్రి తాండురులో ఆర్టీసీ బస్సులను తనిఖీలు చేసేందుకు వచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే. రాత్రి 9.30 గంటలకు చెకింగ్ చేసిన తర్వాత.. ఆకలి వేయడంతో పక్కనే ఉన్న హోటల్ కి వెళ్లి అక్కడ భోజనం చేసేందుకు తమ వెహికిల్ ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు.. అయితే.. చెకింగ్ వెహికిల్ సైడ్ డోర్ అద్దాన్ని కిందికి దించి వాహనంలో ఉన్న బ్యాగు దొంగిలించినట్లు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, ఆ బ్యాగులో ఆర్టీసీకి సంబంధించిన కొన్ని చెకింగ్ పుస్తకాలతో పాటు, టీటీఐ ఐడీ కార్డ్స్, ఆధార్ కార్డులు ఉన్నట్లు ఖమ్మం జిల్లాకు చెందిన చెకింగ్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
పవన్ ఎక్కడ నుంచి పోటీ చేసినా.. వాలంటీర్‌ని నిలబెట్టి అతడ్ని ఓడిస్తాం
జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి జోగి రమేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీచేస్తాననే సవాల్ స్వీకరిస్తే.. అతను ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ వాలంటీర్‌ని నిలబెట్టి, అతడ్ని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. పవన్‌ని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎవరూ అవసరం లేదని, కేవలం వాలంటీర్ చాలని ఎద్దేవా చేశారు. ఈ ఛాలెంజ్‌ని స్వీకరించే దమ్ము పవన్‌కి ఉందా? అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రజల్ని, వాలంటీర్లను చాలా బాధించాయన్నారు. వాలంటీర్ల వల్ల సచివాలయ సంస్థలు సక్సెస్ కావడాన్ని పవన్ జీర్ణించుకోలేకే.. ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో నివసిస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని జోగి రమేష్ ప్రశ్నించారు. ప్రజలపై పవన్‌కి ప్రేమాభిమానం ఉంటే.. పొత్తులకు పోకుండా ఒంటరిగానే బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. అసలు పవన్‌కు సీఎం జగన్ గురించి, మహిళల భద్రతపై మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇచ్చిన కాగితాలు చూసి పవన్ చదువుతున్నారని విమర్శించారు. పవన్‌కి ఏపీతో సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ఇక పురోహితులకు రిటైర్మెంట్ అనేదే లేదని.. వారు ఎక్కడైనా పౌరోహిత్యం చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. అన్నవరంలో పురోహితులను వేలంపాట వేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, భాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతుల కొంపలు ముంచడానికే ధరణి పోర్టల్
మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1,050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని.. కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, పేదవారికి ఇబ్బంది లేకుండా భూప్రక్షాళన చేస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. కానీ.. విమర్శలు రావడంతో ధరణి పోర్టల్ ను తీసుకువచ్చారు.. ధరణి పేరుతో దేశానికే ఈ రాష్ట్రం ఆదర్శం చేస్తాం అని కేసీఆర్ అన్నారని ఈటల తెలిపారు. ఇది రైతులకు మేలు చేస్తుందా కొంపలు ముంచడానికా అని చాలా మంది ఆరోజే అన్నారు అని బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కొంపలు ముంచడానికే ధరణి పోర్టల్ అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ బొమ్మరాజుపేట కేసు అని ఈటల అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి..
డీఈఓలు, ఆర్జేడీలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో అధికారులకు మంత్రి సబితా సలు సూచనలు చేశారు. తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54వేల 201 మంది కుక్-కమ్ హెల్పర్లకు లబ్ది చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం ద్వారా సంవత్సరానికి రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలు ఈ నెల నుండే ఇస్తాము అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మధ్యాన్న భోజన పథకానికి సంబంధించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలి.. విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలి అని ఆమె పేర్కొన్నారను. తొలిమెట్టును విజయవంతంగా అమలు చేసేందుకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వార్షిక ప్రణాలికను విడుదల చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.
కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ కావాలో.. రైతులే చెప్పాలి..
తెలంగాణలో పాలిటిక్స్ మంచి రసవత్తరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ పార్టీ కావాలో తెలంగాణ రైతులే తెల్చుకోవాలని ఆయన సూచించారు.
కాగా, మంత్రి కేటీఆర్ ఇవాళ (శనివారం) బీఆర్‌ఎస్ శ్రేణులతో టెలీకాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్ రద్దుతో పాటు కేవలం రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న హస్తం పార్టీ విధానంపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలి అని ఆయన అన్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ తెలిపారు.
దేశవ్యాప్తంగా మరో నాలుగైదు రోజుల పాటు భారీగా వర్షాలు..
దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు వర్షం దెబ్బకి నానా అవస్థలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పలు రాష్ట్రాల్లోని గ్రామాలు పూర్తిగా వరద ప్రభావంతో అస్థవ్యస్థం అయింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, మరోసారి భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది.
కాగా, దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..
సాయి పల్లవి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుత నటనతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ భామ.ప్రస్తుతం ఈ భామ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది.తాజాగా సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది.ఆలయ సందర్శన తర్వాత కొన్ని ఫొటోలను అలాగే తన అనుభవాలను షేర్ చేసుకుంది.. అమర్‌నాథ్ యాత్ర కు ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుందట ఈ భామ. తాజాగా ఈ భామ అమర్నాధ్ ఆలయాన్ని సందర్శించడంతో అక్కడ తన అనుభవాలను ఈ విధంగా రాసుకొచ్చింది.నేను నా వ్యక్తిగత విషయాలను అస్సలు షేర్ చేసుకోను. కానీ ఈ యాత్ర గురించి మాత్రం మీకు చెప్పాలని ఉంది. ఈ యాత్రను ఎప్పటి నుంచో చేయాలనుకున్నాను. అరవై ఏళ్లు వచ్చిన నా తల్లిదండ్రులతో ఈ యాత్ర అనుభవం మీకు తెలియజేయాలి అని అనుకున్నాను.. కొండలు, గుట్టలు ఎక్కలేక, నడవలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఆయసపడుతూ ఊపిరి బిగపట్టుకుని మంచులో నడుస్తుంటే దేవుడా నువ్వు ఎందుకు ఇంత దూరంలో ఉన్నావ్ అని అనిపించింది.అయితే దర్శనం అయిన తర్వాత తిరిగి వస్తుంటే దేవుడు ఎందుకు ఇంత దూరంలో వున్నాడో అర్థమైంది.
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన సముద్రంలో కలిసిపోవడం ఖాయం
తన వారాహి యాత్రలో భాగంగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా.. వైసీపీ, సీఎం జగన్‌ని టార్గెట్ చేసుకుని పవన్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. దీంతో.. వైసీపీ నేతలు తమదైన శైలిలో పవన్‌పై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా సైతం పవన్‌పై విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాళ్ళపురంలో నిర్వహించిన జగనన్న సురక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుని పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. పిచ్చి ప్రేలాపనలు తప్పితే, పవన్‌కి రాష్ట్రం గురించి ఏమీ తెలియదన్నారు. పవన్ మాటల్లో జగన్‌పై ఈర్ష, అసూయ మాత్రమే కనిపిస్తున్నాయని.. అతని కళ్లల్లో మాత్రం ఓటమి కనిపిస్తోందని పేర్కొన్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు సముద్రంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ రాష్ట్రానికి జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇంకా వరద గుప్పిట్లోనే ఢిల్లీ.. వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
దేశ రాజధాని ఢిల్లీ మహానగరం ఇంకా వరద నీటిలోనే ఉంది. ఇప్పటికే వరద నీటితో ఉన్న ఢిల్లీకి భారత వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. రానున్న 3 -4 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించిన ఐఎండీ.. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. యమునా నదిలో నీటి మట్టం తగ్గినప్పటికీ.. నది ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తుంది. శనివారం ఉదయం 8 గంటలకు యమునా నది నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది. అయితే యమునా నదిలో నీటి మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి పెరగడంతో.. ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఐటీవో, శాంతి వన్ ప్రాంతం, ఆదాయపు పన్ను కార్యాలయం, ఇతర కీలక ప్రాంతాలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. శుక్రవారం రాత్రి 11 గంటలకు యమునా నీటిమట్టం 207.98 మీటర్లుగా నమోదైంది. యమునా నీటి మట్టం తగ్గడంతో.. గురువారం మూసివేసిన ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాన్ని తెరిచారు. ఓఖ్లా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పునఃప్రారంభించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. శనివారం ఉదయం నాటికి యమునా నది నీటిమట్టాలు 207.7 మీటర్లకు తగ్గితే.. వజీరాబాద్, చంద్రవాల్‌లోని మరో రెండు నీటి శుద్ధి ప్లాంట్లను కూడా పునఃప్రారంభిస్తామని చెప్పారు.
ప్రకృతిని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం..
ప్రకృతిని కాపాడుకుంటూ.. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ పరస్పర సమన్వయంతో.. ముందుకెళ్లినపుడే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్న టైంకి చేరుకోవచ్చని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ ఏకతాటిపైకి వచ్చి కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో ఆర్థిక ప్రగతి, సామాజిక, పర్యావరణ సుస్థిరత అంశంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఆధ్వర్యంలో ఐక్యరాజ్యసమితి హైలెవల్ పొలిటికల్ ఫోరం (HLPF) వేదికగా జరిగిన సదస్సులో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో భారతదేశం తరపున పాల్గొనడం గర్వంగా ఉందని.. కిషన్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా పర్యావరణ సుస్థిరత కోసం మోడీ సర్కారు చేస్తున్న కృషి కారణంగా.. నేడు టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు ఎజెండా నిర్దేశించడంతో పాటు ముందుండి విజయవంతంగా నడిపామని ఆయన అన్నారు.