77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. వరుసగా 10వ సారి ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగువేయనున్నారు. ఉదయం 7.30కు జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేయనున్నారు.
ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరికొన్ని చోట్ల వర్ష బీభత్సానికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో జాతీయ రహదారులను అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో చార్‌థామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఉత్తరాఖండ్ అధికారులు చెప్పారు.
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి సోమవారం నివాళులు అర్పించారు. 1947 ఆగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కి ఏదో ఒకటి మాట్లాడటం అలవాటని, జనం నవ్వుకుంటారని కూడా పవన్ కు లేదని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పై బురద చల్లడమే పవన్ పనిగా పెట్టుకున్నాడని, 1962, 63 లో తెలంగాణ ఉద్యమం జరిగింది అప్పుడు ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. breaking news, latest news, telugu news, big news, perni nani, pawan kalyan
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అరాచక శక్తుల మూక అని, చంద్రబాబు డైరెక్షన్ లో ఆరోపణలు చేస్తున్నారన్నారు.. breaking news, latest news, telugu news, big news, sajjala ramakrishna reddy, pawan kalyan, chandrababu
తిరుపతి జిల్లాలోని పుత్తూరులో టిడ్కో ఇళ్లను మంత్రి రోజా పరిశీలించారు.ఈ క్రమంలోనే రూ.4.5 కోట్లతో టిడ్కో ఇళ్ల ఆధునీకరణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరిలోని జగనన్న నగర్ కాలనీలో మౌలిక వసతుల పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. breaking news, latest news, telugu news, minister roja, ycp, tdp, chandrababu
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు చిత్తూరు జిల్లా పుంగనూరులో మీడియాతో మాట్లాడుతూ.. సభ్యత సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని నిప్పులు చెరిగారు. breaking news, latest news, telugu news, big news, karumuri nageswara rao, pawan kalyan, chandrababu