ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం గుజరాత్‌కు చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు గంగోత్రి నుంచి తిరిగి వస్తుండగా గంగ్నాని వద్ద ప్రమాదానికి గురైంది.
పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ మార్పు తీసుకువస్తుందని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, jagadish reddy
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఓ ఘోర సంఘటన జరిగింది. యూపీలో తీర్థయాత్రకు వచ్చిన ఓ వృద్ధుడు ఆదమరిచి నిద్రపోతున్న ఐదేళ్ల బాలుడిని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన పట్టపగలే అందరూ చూస్తుండగానే జరిగింది.