పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్‌లోని గుల్మిర్‌కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్‌ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్‌లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు.
పాడేరు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. క్షతగాత్రులకు మంచి ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని.. ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందినట్లుగా సమాచారం తెలుస్తోంది. సుమారు 15 మంది వరకు తీవ్ర గాయాలు అయ్యాయి.
త్వరలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ కొత్త టీమ్‌ను సిద్ధం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ప్రకటించారు.
వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్‌కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది.
లోకేశ్ చేపట్టిన యువగళం ఈవినింగ్ వాక్ అని విమర్శించారు. విజయవాడ నగరం గురించే మాట్లాడలేవని లోకేష్ ను ఎద్దేవా చేశారు. లోకేశ్ చేస్తున్న యాత్రకు ప్రజాదరణ లభించడం లేదని.. అందువల్లనే టీడీపీ ఎంపీలు లోకేష్ యాత్రను బహిష్కరించారని వెల్లంపల్లి తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మద్దతు ఇచ్చి..అండగా నిలిచి, ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం లో ని బట్టివాడ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ప్రచారం ప్రారంభించారు జీవన్‌రెడ్డి. breaking news, latest news, telugu news, big news, mlc jeevan reddy, congress