హైదరాబాద్‌లో కుండపోత వర్షం..
ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. తెల్లవారుజాము నుండి ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల కారణంగా దాదాపు కనిపించకుండా పోయి, భారీ ఈదురుగాలులు, గాలులతో నగరంలో వర్షాలు కురిశాయి. IMD ప్రకారం, బంగాళాఖాతంలో వాయుగుండం, విదర్భ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌పై ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు కురిశాయి. తెలంగాణ వాతావరణ శాఖ ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా మహబూబ్‌హార్‌లో 153.5 మిమీ, రంగారెడ్డిలో 141.8 మిమీ, సూర్యాపేటలో 135 మిమీ వర్షం కురిసింది. నగర పరిధిలో అత్యధికంగా మారేడ్‌పల్లిలో 42, ముషీరాబాద్‌లో 37, సికింద్రాబాద్‌లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలో భారీ తుపానులు ఏర్పడుతున్నాయని, మధ్యాహ్నం వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ ఔత్సాహికుడు టి బాలాజీ ట్విట్టర్‌లో వాతావరణ హెచ్చరికను పోస్ట్ చేశారు.
10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డ్‌ని అప్ డేట్ చేసుకోండి.. సెప్టెంబర్ 14 వరకే ఫ్రీ
ప్రస్తుతం ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అనేక ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు అవసరం. ప్రజలు ఆధార్ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆధార్ జారీ అయిన తర్వాత చాలా మంది ఇప్పటి వరకు అప్ డేట్ చేయలేదు. దీంతో పదేళ్లు దాటి ఆధార్ కార్డులను అప్ డేట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రస్తుతం ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు మంచి అవకాశం వచ్చింది. సెప్టెంబర్ 14 వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఈ సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే ఉచితం. మిగిలిన కేంద్రాల్లో మునుపటిలాగానే వసూలు చేస్తున్నారు. సెప్టెంబర్ 15, 2023 నుండి myAadhaar పోర్టల్‌లో కూడా డబ్బులు వసూలు చేస్తారు.
రాత్రికి రాత్రే మారిన జాలర్ల జాతకం.. ఆ ఒక్కటి వారి జీవితాన్ని మార్చేసిందిగా
ఒక్కోసారి ఈ ఏడాది మనకు అస్సలు బాలేదు. కాలం కలిసి రాలేదు అనుకుంటూ ఉంటాం. అలాంటప్పుుడే మెరుపులా భలే ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కష్టం తీరిపోతే సూపర్ గా ఉంటుంది కదా. అలాగే జరిగింది పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం మారిపోయింది అనే వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం.ఇలాంటివి ఎక్కువ వెస్ట్ బెంగాల్ లోనే జరుగుతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రం చేపలకు చాలా ఫేమస్. దేశంలో ఎక్కువ చేపలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ చాలా మంది చేపల వేటపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తారు. వీరిలో కొంతమంది వలలో కొన్ని ఖరీదైన చేపలు పడి రాత్రికి రాత్రే వారి జీవితాన్ని మార్చేస్తాయి. తాజాగా మళ్లీ అలానే వెస్ట్ బెంగాల్ లోని కొంతమంది జాలర్ల జీవితం మారిపోయింది.
జీ20 సమ్మిట్ దృష్ట్యా 300రైళ్లు రద్దు
జీ20 శిఖరాగ్ర సమావేశం 2023 సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో జరుగుతుంది. సెప్టెంబర్‌లో దేశ రాజధానిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖుల సమ్మేళనం జరగనుంది. జీ20 సదస్సులో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తగా ఏర్పాట్లు చేశారు. అనేక మార్గాలను నిషేధించారు. అదే సమయంలో దుకాణాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది కాకుండా భారతీయ రైల్వే ఇప్పుడు అనేక రైళ్ల రద్దు, మళ్లింపు గురించి కూడా సమాచారం ఇచ్చింది. G20 సమ్మిట్ కారణంగా 200 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంత ఉందంటే?
శ్రావణమాసం మాసం మహిళలకు చాలా ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో బంగారాన్ని కొనుగోలు చెయ్యాలని భావించేవారికి ధరలు నేడు షాక్ ఇస్తున్నాయి.. అంతర్జాతీయంగానే పసిడి ధరలు పెరుగుతుండడంతో దేశీయ మార్కెట్లోనూ రేట్లు పెరుగుతున్నాయి. క్రితం రోజు గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి ఇవాళ మరోసారి షాక్ ఇచ్చింది. అయితే, వెండి మాత్రం వరుసగా రెండో రోజు పడిపోయి కాస్త ఊరట కలిగించింది..తులం బంగారంపై ఏకంగా రూ. 170 వరకు పెరగడం గమనార్హం. దీంతో తగ్గిన దాని కంటే ఈరోజు పెరిగిన ధర ఎక్కువ కావడం గమనార్హం.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
*. చెన్నైలో ఆదివారం 22 క్యారెట్స్ తులం గోల్డ్ ధర రూ. 55,550కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 60,490గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం రూ. 55,200కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది.
*. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ ధర రూ. 55,350కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,370గా ఉంది.
*. బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 55,200, 24 క్యారెట్స్ ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది..
*. హైదరాబాద్‌లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,200గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,220 వద్ద కొనసాగుతోంది..
వేగవంతమైన ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియ.. బిడ్‌ల ఆహ్వానం
ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాల విక్రయ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రభుత్వం త్వరలో అసెట్ వాల్యూయర్‌ను నియమించనుంది. ఇందుకోసం ఆసక్తిగల పార్టీల నుంచి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఇందుకోసం అక్టోబరు 9 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు. ఎంపిక చేయబడిన అసెట్ వాల్యూజర్ మొత్తం విక్రయ ప్రక్రియలో బ్యాంక్ ఆస్తులను మూల్యాంకనం చేయడంలో సాయం అందించాలి. ఐడీబీఐ బ్యాంక్‌లో తన వాటా విక్రయాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వాయిదా వేయవచ్చని గతంలో మీడియాలో ప్రచురితమైన నివేదికలో పేర్కొన్నారు. అయితే తాజా అడుగును బట్టి ప్రభుత్వం పాత ప్లాన్ నే అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
యూజీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి అది నిలిపివేత
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మార్కుల షీట్, ప్రొవిజినల్ సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ను ముద్రించడానికి వీలు లేదని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు సర్టిఫికేట్లపై ఆధార్ నంబర్ ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు, రిక్రూట్‌మెంట్ల విషయంలో కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, కొన్ని సంస్థలు ఆధార్ నంబర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల పరిధిలోని యూనివర్సిటీలు విద్యార్థుల డిగ్రీలు, ప్రొవిజినల్స్‌పై ఆధార్ నంబర్లు ముద్రిస్తున్నారు. దీని ద్వారా వ్యక్తిగత సమాచారం బయటకు వెళుతుందని భావించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అలా ముద్రించడం నిలిపివేయాలని ఆదేశించింది. విద్యార్థుల ప్రైవేట్ డేటాబేస్‌ను పబ్లిక్ చేయడం ఆమోదయోగ్యం కాదని యూజీసీ సెక్రటరీ ప్రొ. మనీష్ ఆర్. జోషి వెల్లడించారు.