ఓ మహిళకు వైద్యం చేయిస్తాననే నెపంతో ఆమెపై రెండు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక బాబాను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ పేరుతో నవ వధువుపై అత్యాచారానికి పాల్పడ్డ నకిలీ బాబా మాజర్ ఖాన్.. బండ్లగూడలో యునాని మెడిసిన్ షాపు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన నెల రోజులకే నవవధువు తీవ్ర అస్వస్థత గురైంది. దీంతో.. చికిత్స నిమిత్తం మాజర్ ఖాన్ వద్దకు అత్తమామలు తీసుకువెళ్లారు. అయితే.. చికిత్స పేరుతో మహిళను వివస్త్ర చేసి మజార్ అత్యాచారానికి…
కేరళలోని కొట్టాయం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రి మృగంగా మారాడు. మానసిక ఒత్తిడితో మొదట తన ముగ్గురు కూతుళ్లను గొంతు కోసి చంపాలని ప్రయత్నించి, ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పశ్చమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ జేమ్స్ బాండ్లా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ సహా ఏడు యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీసుకున్న చర్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లా చసానా సమీపంలో సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం మరియు ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతంకాగా.. ఓ జవాన్ గాయపడ్డాడు.
2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్‌ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సోమవారం ఖండించింది. ప్రతిపక్ష నేతృత్వంలోని భారత కూటమికి అలాంటి వ్యాఖ్యలతో సంబంధం లేదని పేర్కొంది.
త్తర ప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే - ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది.
శరీర శక్తి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ఖర్జూరంతో శెనగపప్పు కలుపుకుని తినండి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని ఈ రెండు పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది మంచిర్యాల జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత తీరు. ఎమ్మెల్యే సీటు వచ్చేదాక కార్యకర్తలను వాడుకొని.. తీరా గద్దెనెక్కాక కార్యకర్తల ముఖం కూడా చూడలేదు. దీంతో.. మంచిర్యాల కాంగ్రెస్‌లో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. breaking news, latest news, telugu news, big news, congress