గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయంకు పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. అయితే పవన్ ను బయటకు వెళ్ళకుండా ఆపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
దేశ రాజధానిలో జరుగుతున్న జీ20 సమ్మిట్లో రెండో సెషన్ ప్రారంభమైంది. జీ20 సమ్మిట్లో ప్రధాని మోడీ మొదటి సెషన్లోనే అనేక ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. జీ20 తొలి సెషన్ను ముగించిన అనంతరం ప్రధాని మోదీ ఈరోజు మీడియాతో మాట్లాడారు. జీవ ఇంధనంపై ప్రపంచ కూటమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
జీ20 సమ్మిట్లో ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఏకాభిప్రాయాన్ని ప్రకటిస్తూ దీనిని సాధ్యం చేసేందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, ఇతర అధికారులకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుధ్ర వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా.. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సిద్ధార్థ లోధ్రా అండ్ టీమ్ గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు సిద్ధార్థ లుద్ర.
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివరించారు. తాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకునే మాధ్యమం యూట్యూబ్ అని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 21 నుంచి రెండో విడతగా 13,300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నగరంలో 2 బీహెచ్కే కార్యక్రమంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి దశలో సుమారు 11,700 breaking news, latest news, telugu news, minister ktr, double bedroom,
చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే విచారణ సంస్థలు గుడ్డిగా వెళ్ళిపోవని స్పీకర్ అన్నారు. చట్టంకి ఎవరూ చుట్టం కాదని తెలిపారు.