Akhil Akkineni Lenin: అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు మేకర్స్. నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో సినీ ప్రేమికుల్లో హైప్ పెంచేసిన ఈ మూవీ టీమ్, ఇప్పుడు సాంగ్ రిలీజ్ డేట్ రివీల్ చేసి మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5న విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ రిలీజ్ చేశారు. అఖిల్ మాస్ అవతార్, థమన్ మ్యూజికల్ మ్యాజిక్‌తో ఈ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.
READ ALSO: IND vs PAK T20 World Cup: భారత్ వర్సెస్ పాక్: 2026 టీ20 వరల్డ్ కప్లో ఎన్నిసార్లు తలపడనున్నారు..?
అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సూర్యదేవర నాగ వంశీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సరం రోజున రిలీజ్ చేసిన పోస్టర్‌లో అఖిల్ రగ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. గడ్డం, లాంగ్ హెయిర్‌తో మాస్ హీరోగా మారిన అఖిల్, షర్ట్ లాగుతూ స్మైల్ ఇస్తున్న ఫోజ్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇక హీరో అక్కినేని అఖిల్ తన ఎక్స్ ఖాతాలో “హ్యాపీ న్యూ ఇయర్.. లెనిన్ ఫస్ట్ సింగిల్ సూన్” అంటూ పోస్ట్ చేశారు. ఆయన కెరీర్ విషయానికి వస్తే 2015లో ‘అఖిల్’ సినిమాతో డెబ్యూ చేసిన అఖిల్, ఆ తర్వాత ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఏజెంట్’ చిత్రాల్లో నటించారు. ఎన్నో రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ‘లెనిన్’ కీలకం కానుంది. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అఖిల్ క్యారెక్టర్ టైటిల్ ‘లెనిన్’గా పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ 2026లో వరల్డ్‌వైడ్ రిలీజ్ కానున్న ‘లెనిన్’.. అఖిల్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 5న రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సింగిల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
Happy new year to you all ! Let’s make 2026 a year to remember. Love, health and happiness to everyone ❤️.#LENIN first single out very soon 🙂 5th jan it is 🤗…. Enjoy ! Summer 2026 Release. pic.twitter.com/nrTh2ikN3Y
— Akhil Akkineni (@AkhilAkkineni8) January 1, 2026
READ ALSO: India challenges 2026: కొత్త ఏడాదిలో భారత్ ముందున్న 10 సవాళ్లు ఇవే..