రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది. అయితే ధురంధర్ స్ట్రామ్ చూసిన బీటౌన్ సీనియర్ హీరోలు ఆ సీక్వెల్‌తో రిస్క్ చేసేందుకు రెడీగా లేరట. ఈద్‌కు ధమాల్4తో వద్దామనుకున్న అజయ్ దేవగన్ ఆ డేట్ నుండి దుకాణం సర్దేసుకున్నాడని టాక్.
Also Read : TheRajaSaab : రాజాసాబ్ రన్ టైమ్ ఏకంగా నాలుగు గంటలపైనే : మారుతీ
అజయ్ దేవగన్ మాత్రమే కాదు.. అక్షయ్ కుమార్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నాడట. ఏప్రిల్2న హారర్ కామెడీ భూత్ బంగ్లాతో వద్దామనుకున్నాడు ఖిలాడీ హీరో. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో తన కొలాబరేషన్‌పై నమ్ముకమున్నా.. ధురంధర్ మాస్ హిస్టీరియా నాలుగు వారాలకు పైగా పాకడాన్ని చూసిన హీరో… ధురంధర్2 సీక్వెల్‌కు లైన్ క్లియర్ చేయాలనుకుంటున్నాడట. అలాగే ఏప్రిల్ 3న వస్తున్న ఇమ్రాన్ హష్మీ ఆవారాపన్2 కూడా సైడ్ అయ్యేట్లుగానే హింట్స్ ఇస్తోందని బీటౌన్ ట్రేడ్స్ అంటున్నాయి. గత ఏడాది డిసెంబర్ 5న రిలీజైన ధురంధర్ ఇప్పటి వరకు 1100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టుకుని.. సీక్వెల్ పై అంచనాలు పెంచింది. కానీ మొన్న కాంపిటీషన్ లేకపోయినప్పటికీ.. మార్చి 19న రిలీజయ్యే ధురంధర్2తో క్లాష్‌కు సిద్దమౌతోంది శాండిల్ వుడ్ పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. ఇక వారం రోజుల గ్యాప్‌లోనే టాలీవుడ్ ఫిల్మ్ ప్యారడైజ్, పెద్ది వచ్చేస్తున్నాయి. మరీ ఈ పోటీని తట్టుకుని రణవీర్- ఆదిత్యధర్ ఫిల్మ్ ఏ మేరకు వసూళ్లను రాబట్టుకుంటుందో చూడాలి.