అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం కేసు పెట్టనున్నారు. బిస్వా శర్మ భార్య రింకీ భుయాన్ శర్మతో సంబంధం ఉన్న కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో డబ్బులు అందాయని లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.
కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో జరిగిన విజయ శంఖనాద్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలంతా కలిసి కూటమిని ఏర్పాటు చేసుకున్నారని ప్రధాని అన్నారు. ఇప్పుడు వీరంతా భారతదేశం యొక్క శాశ్వతమైన సంస్కృతిని నాశనం చేస్తున్నారని.. తమ అధికార దురాశతో దానిని విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకున్నారని మోడీ తెలిపారు.
కాన్పూర్‌లో రిటైర్డ్ టీచర్ రమేష్ బాబు శుక్లా హత్య కేసులో శిక్ష పడింది. రిటైర్డ్ ప్రిన్సిపల్ రమేష్ బాబు శుక్లా నుదుటిపై తిలకం, చేతికున్న కంకణాన్ని చూసి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ హత్య ఉదంతంపై అక్టోబర్ 2016న ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తాజాగా.. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీవ్రవాదులు అతిఫ్ ముజఫర్, మహ్మద్ ఫైజల్‌లకు మరణశిక్ష విధించింది.
ముంబై విమానాశ్రయంలో గురువారం ఓ ప్రైవేట్ చార్టర్డ్ విమానం ప్రమాదానికి గురైంది. భారీ వర్షంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. ఘటనా సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లలో చాలా ముందుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్ గురువారం స్పందించారు. పాకిస్తాన్‌ను ఒంటరిగా చేయడం గురించి ఆలోచించాలన్నారు. ఎందుకంటే మనం అలా చేయకపోతే.. వారు దానిని సాధారణ విషయంగా పరిగణిస్తారని తెలిపారు.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్‌లు జారీ చేశాయి. ఎంపీలు పార్లమెంట్‌కు హాజరు కావాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది.
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే భాష దేశాన్ని ఏకం చేయదని అన్నారు.
పల్లెటూర్లలో విరివిగా కనిపించే ఈ చెట్టుని విరిగి చెట్టు, నక్కెర కాయల చెట్టు, బంక కాయల చెట్టు అని ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా పిలుస్తుంటారు. వీటి ఫలాలు బంకగా ఉంటాయి. అందుకే వీటిని బంక కాయల చెట్టు అని కూడా అంటారు. ఇక ఈ చెట్టు ఉపయోగాలు అన్నీఇన్నీ కాదు.