VK Singh: జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధౌనెక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిఎస్పీ హుమాయున్ భట్ వీరమరణం పొందారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్ గురువారం స్పందించారు. పాకిస్తాన్‌ను ఒంటరిగా చేయడం గురించి ఆలోచించాలన్నారు. ఎందుకంటే మనం అలా చేయకపోతే.. వారు దానిని సాధారణ విషయంగా పరిగణిస్తారని తెలిపారు. మనం వారిని ఒత్తిడికి గురిచేసి.. ఒంటరిని చేయాలని అన్నారు. పాకిస్తాన్ మామూలుగా మారితే తప్ప ఏ బంధమూ సాధ్యపడదని.. పాకిస్థాన్ ను ప్రపంచం నుంచి వేరు చేయాల్సిందేనని వీకే సింగ్ అన్నారు. కొన్ని సందర్భాల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు, క్రికెట్ సెలబ్రిటీలు ముందుకు రావాలని తెలిపారు. కానీ మనం పాకిస్తాన్‌ను వేరు చేయాల్సిందేనని వీకే సింగ్ పేర్కొన్నారు.
మరోవైపు ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా సంస్థలు నిరంతరం గాలిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా ప్రత్యేక బలగాలు మోహరించారు. మరోవైపు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ చుట్టుముట్టినట్లు వార్తలు వచ్చాయి. ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్, మేజర్ ర్యాంక్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీరమరణం పొందారు. ఈ ఘటనపై డీజీపీ దిల్‌బాగ్ సింగ్ సంతాపం తెలిపారు. ఈ మరణం దురదృష్టకరమని అన్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని.. త్వరలోనే తగిన బుద్ధి చేప్తామన్నారు.