గుజరాత్‌లోని తిరుచిరాపల్లి-శ్రీ గంగానగర్ మధ్య నడిచే హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. రైలు నుంచి పొగలు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికమైంది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. అక్కడి ప్రభుత్వంలో మరో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజ్ రాయరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఐదుగురిని ఉపముఖ్యమంత్రులను చేసే విషయమై చర్చిస్తున్నామని రాయరెడ్డి తెలిపారు.
రాజస్థాన్ లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. శనివారం అక్కడ జరిగిన కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం జైపూర్‌లో కొత్త కాంగ్రెస్ కార్యాలయానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. విపక్షాల కూటమి (INDIA) పేరుపై వివాదాన్ని చర్చించడానికి ప్రధాని మోడీ ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌ను ప్రకటించాడన్నారు.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
అవినీతి కేసుల్లో పదేళ్లు బెయిల్‌పై బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రజాసేవకుడైన చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మున్ముందు ఎలా ముందుకెళ్లాలో తానే కొత్త దారి చూపించాడని ఆయన వ్యాఖ్యానించారు.
పంజాగుట్ట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న లేడీ ఎస్సై భావన, ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ ప్రీ వెడ్డింగ్ షూట్‌పై సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారి వివాదాన్ని సృష్టించింది. అయితే కొత్తగా పెళ్లయిన పోలీసు జంట సీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. అనంతరం నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అయితే మొన్న జరిగిన ఫ్రీ వెడ్డింగ్ షూట్‌పై స్పందిస్తూ.. వ్యక్తిగత వేడుకలకు యూనిఫాం గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సీపీ గుర్తు చేశారు. అంతేకాకుండా పోలీస్…