ఏపీలో జరిగే ఎన్నికలు లోకల్, నాన్‌లోకల్ మధ్య పోటీ అంటూ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నరేళ్లల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క పండుగ కూడా ఏపీలో జరుపుకోలేదని ఆయన వెల్లడించారు.
మగవారి కోసం కొత్త రకం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఇంజెక్షన్ సహాయంతో 99 శాతం గర్భాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఏడేళ్ల ఇంటెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ ఇంజెక్షన్‌ను ఆమోదించారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభమని.. దీని సక్సెస్ రేట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మా, సీరియల్ నటులు... తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి నగరంలోని వివిధ ప్రాతాలలో దుర్గా పూజా మండపాల వద్దకు సందడి చేశారు.
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా…
గ్రీన్ టీ తెలుసు, బ్లాక్ తెలుసు.. కానీ వైట్ టీ ఉంటుందన్న విషయం కొందరికి తెలియదు. సాధారణంగా చాలా మంది టీ తాగడం అలవాటే. కానీ వైట్ టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలిసుండదు. వైట్ టీ తాగడం వలన ముఖ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంది.. అంతేకాకుండా ముఖంపై కనపడే వృద్దాప్యాన్ని కనపడకుండా దోహదపడుతుంది. ఇదిలా ఉంటే.. వైట్ టీ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీమైక్రోబయల్ గుణాలు..…
ఏపీ ఈ-చలాన్ల డబ్బును మాయం చేశారని గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజు వెల్లడించారు. డీజీ అకౌంట్‌కు అనేక రకాల రూపాలలో ఈ- డేటా చలానాకు సంబంధించిన డబ్బులు వస్తాయని.. డీజీ అకౌంట్స్ ద్వారా వచ్చే నగదు మాయమవడం మొదలైందని ఆయన తెలిపారు.
పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు లిటన్ దాస్, తంజీద్ హాసన్ శుభారంభం అందించారు. వీరిద్దరు అర్థసెంచరీలు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు చెతులెత్తేశారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దర్శించుకోనున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఒకప్పుడు బలమైన జట్టుగా ఉండేదని.. నిప్పులు చెరిగే పేస్ బౌలర్లు, బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు ఉండేవాళ్లని, అంతేకాకుండా బ్యాట్స్ మెన్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.