Rainbow Childrens Hospital: దేశ చరిత్రలో మొట్టమొదటి సారి.. శిశువు ప్రాణాలు కాపాడేందుకు వాయుమార్గంలో తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainbow Childrens Hospital: తీవ్రమైన న్యుమోనియా, ఏఆర్‌డీఎస్‌తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుంది. ఈ చిన్నారిని రక్షించడానికి హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అద్భుతమైన టీమ్‌వర్క్, సమన్వయం, నిబద్ధతను ప్రదర్శించింది. మన దేశంలో ఒక చిన్నారిని కాపాడటానికి ఈ తరహా వైద్య జోక్యం జరగడం ఇదే తొలిసారి.

Also Read
- Clothes Washing Tips: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి? ఈ తప్పు చేస్తే మీ బట్టలు పాడైపోవడం ఖాయం!
- US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
- Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
- Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
ఇన్ఫ్లుఎంజా న్యుమోనియాలో తర్వాత స్థాయి ARDS (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) ఆ చిన్నారికి ఉంది. అప్పటికే 1 వారం పాటు కృత్రిమ ఊపిరి సహాయంపై ఉన్నాడు. ఆ చిన్నారి హై-ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్, 100% ఆక్సిజన్, HFOVలో మద్దతుతో ఉన్నాడు. ఈ తరహా మద్దతు ఉన్నప్పటికీ అతను ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో తీసుకోలేక పోతున్నాడు కాబట్టి, అతనికి ఎక్మో సహాయం అందించటం ప్రారంభించడం, ఆ తరహా రోగులను నిర్వహించగల ఆసుపత్రికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే రక్షించబడగలడు. ECMO అంటే ఎక్స్ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్. ఈ ప్రక్రియ లో రక్తం ఒకరి శరీరం వెలుపల, గుండె-ఊపిరితిత్తుల యంత్రానికి పంప్ చేయబడుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ను తొలగించి ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని శరీరంలోని కణజాలాలకు తిరిగి పంపుతుంది. ఇది ఊపిరితిత్తులకు విశ్రాంతి కల్పించటం తో పాటుగా తిరిగి కోలుకోవటానికి, ఆక్సిజన్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల మాట్లాడుతూ.. “అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చదగిన సర్వైవల్ రేటుతో ప్రముఖ పీడియాట్రిక్ ECMO సెంటర్‌గా వెలుగొందుతున్న రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు ఈ చిన్నారి తరలింపు కోసం కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, ECMO శిక్షణ పొందిన పెర్ఫ్యూషనిస్ట్, ECMO శిక్షణ పొందిన ఇంటెన్సివ్ కేర్ నర్సు, బయోమెడికల్ బృందం ICATT బృందంతో కలిసి గోవా ఆసుపత్రిలో ECMOను సురక్షితంగా నిర్వహించడానికి మరియు బిడ్డను ఇక్కడికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమై పోయాయి…” అని అన్నారు

యూకేలో లో ఎక్మోపై శిక్షణ పొందిన సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కపిల్ బి సచానే ఈ ఎయిర్ అంబులెన్స్ బృందానికి నేతృత్వం వహించారు. ఆయన ఈ బృందం లో కీలక సభ్యుడైన పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సాయి రామ్‌తో కలిసి మాట్లాడుతూ .. “రెయిన్బో రిట్రీవల్ టీమ్ 24 గంటలకు పైగా అవిశ్రాంతంగా పని చేయడం ద్వారా ఈ విధిని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ECMO మద్దతు అందించాలని నిర్ణయం తీసుకున్న నాలుగు గంటల్లోపే , మా బృందం గోవా చేరుకుంది. శిశువుకి 6 గంటల్లోపే ECMO మద్దతును వేగంగా అందించగలిగాము. ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో ఉంది. దీనికి తోడు కొత్త ఆసుపత్రిలో ECMOని ప్రారంభించడం కూడా సవాలుగా మారింది. అలాగే, దేశంలో ఇలాంటి రవాణా నిర్వహించడం ఇదే తొలిసారి. స్థానిక ఆసుపత్రిలో ECMO ప్రారంభించిన తర్వాత, సగం పని పూర్తయింది. ఈ చిన్నారి ఆక్సిజన్ సాచురేషన్ మెరుగుపడింది. తల్లిదండ్రులు కొంచెం ఉపశమనం పొందారు. మాకు ఒక అద్భుతమైన సర్జన్ ఉన్నారు. ఆయన నైపుణ్యం , కృషి ఈ చిన్నారిని కాపాడటంలో ఎంతగానో తోడ్పడింది. ఈ చిన్నారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించటానికి ముందు, రవాణా సమయంలో చిన్నారి సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి మా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది…” అని వెల్లడించారు.
డాక్టర్ ఫర్హాన్ షేక్, HOD, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, RCH, బంజారా హిల్స్ మాట్లాడుతూ.. “ ఈ చిన్నారి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధిని కలిగి ఉన్నాడు. 29 రోజులు (సుమారు 4 వారాలు) ECMO పై ఉన్నాడు. వివిధ విభాగాల మధ్య ఖచ్చితమైన ప్రణాళిక, సమన్వయం కారణంగా మేము ఈ తరలింపును విజయవంతంగా చేయగలిగాము. యూనిట్లో ఎక్కువ కాలం ఉన్న ఈ బిడ్డ సంరక్షణ సవాలుగా నిలిచింది. ఈ చిన్నారి హాస్పిటల్లో వున్న సమయంలో ఆరోగ్య పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు తమ పూర్తి మద్దతు అందించారు . టీమ్‌వర్క్, 24 గంటల ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ మద్దతు, అద్భుతమైన ఇన్ఫెక్షన్ కంట్రోల్ పద్ధతులతో మేము ఈ చిన్నారిని రక్షించగలిగాము…” అని అన్నారు.
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అనుపమ యెర్రా మాట్లాడుతూ, “ECMO మద్దతు అవసరమైన పిల్లలను వేగంగా ఎయిర్‌లిఫ్ట్ చేయగల మా సామర్థ్యం ఈ చిన్నారి ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడింది. అతి ప్రధానమైన ఎయిర్ అంబులెన్స్ ప్రొవైడర్స్ తో మా భాగస్వామ్యం ఇందుకు తోడ్పడింది. అనారోగ్యంతో ఉన్న శిశువులకు సురక్షితమైన, సమర్థవంతమైన, సకాలంలో తగిన రవాణా అందేలా మేము అందించగలుగుతున్నందుకు గర్వపడుతున్నాము. ఇది జీవితాలను రక్షించడానికి, సమయానుకూల జోక్యాన్ని సాధ్యం చేయడానికి మరియు చివరికి నిరాశలో కూరుకుపోయిన సమయంలో కుటుంబాలకు ఆశను తీసుకురావడానికి గోల్డెన్ పీరియడ్ ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడుతుంది..” అని అన్నారు
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ, “దేశంలోనే నియోనాటల్, పీడియాట్రిక్ ట్రాన్స్పోర్ట్ సేవలలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను రెయిన్బో కలిగి ఉంది. మేము రెండు దశాబ్దాలగా రోడ్డు, వాయు రవాణా రెండింటినీ చేస్తున్నాము. మేము చాలా చిన్న వయసు కలిగిన, అనారోగ్యంతో ఉన్న శిశువులను విజయవంతంగా తరలించడం చేసాము. ఇటీవల ఇన్హెల్డ్ నైట్రిక్ ఆక్సైడ్తో HFOV పై PPHN లో ఉన్న శిశువును ఎయిర్‌లిఫ్ట్ చేసిన దేశంలో మొదటి హాస్పిటల్ గా మేము నిలిచాము. నేను ఆ కుటుంబానికి మరియు అసాధారణమైన టీం వర్క్ ను ప్రదర్శించినందుకు మా వైద్య బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను…” అని అన్నారు.
ఎయిర్ లిఫ్ట్ చేయబడిన ఈ చిన్నారి ఇప్పుడు చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాడు, ECMO నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు అతి తక్కువ ఆక్సిజన్ మద్దతులో ఉన్నాడు. అతడిని త్వరలోనే గోవాకు తీసుకెళ్లేందుకు అతని తల్లిదండ్రులు ప్రణాళిక చేస్తున్నారు. పిల్లల జీవితాలను రక్షించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ, మారుమూల ప్రాంతాల నుండి కూడా అనారోగ్యం తో ఉన్న రోగులకు వైద్యం అందించడానికి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తీవ్రంగా శ్రమిస్తోంది. అన్ని ప్రధాన ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాలతో, వారు తక్షణమే పని చేస్తారు, వేగవంతమైన రవాణా మరియు సకాలంలో జోక్యానికి తగిన భరోసా ఇస్తారు. వారి అంకితభావం వల్లనే అనేకమంది ప్రాణాలు కాపాడబడ్డాయి.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
Clothes Washing Tips: బట్టలు ఉతకడానికి ముందు ఎంతసేపు నానబెట్టాలి? ఈ తప్పు చేస్తే మీ బట్టలు పాడైపోవడం ఖాయం!
-
HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!