తాజా ప్రపంచకప్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింత పెంచేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆరోపించారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణను ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించాలని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయని షోయిగు చెప్పారు.
ప్రతిరోజూ స్నానం చేస్తే శుభ్రంగా ఉంటారని అందరికి తెలుసు. మరీ ముఖ్యంగా ఇండియన్స్ అయితే సాంప్రదాయం అని క్రమం తప్పకుండా రోజు స్నానం చేస్తారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో స్నానం పవిత్రంగా భావిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. రోజూ స్నానం చేయడం వల్ల శరీరానికి హాని కలుగజేస్తుందట.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) యోచిస్తోంది.
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గత తగాదాలను దురదృష్టకర పరిస్థితి అని అన్నారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా పూణే వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.
వన్డే ప్రపంచకప్-2023 మ్యాచ్లో భాగంగా నేడు శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు మధ్య మ్యాచ్ జరగుతుంది. పూణేలో ఈ మ్యాచ్ లో జరుగుతుండగా.. మ్యాచ్కు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీలంక జాతీయ గీతం అలపిస్తుండగా మస్కట్కు చెందిన ఓ బాలుడు ఉన్నట్టుంది కింద పడిపోయాడు.
కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్ (ఎస్ఐసీ)ల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమాచార హక్కు చట్టం, 2005 ‘మృతపత్రం’గా మారుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
ఆఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్కు రూ.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్న విషయంపై రతన్ టాటా స్పందించారు. అదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ న్యూస్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఏ ఆటగాడికి సంబంధించిన సలహాలు లేదా ఫిర్యాదుల విషయంలో నేను ఐసీసీకి ఎలాంటి సలహా ఇవ్వలేదని రతన్ టాటా తన ట్వీట్లో రాశారు.
ఛత్తీస్గఢ్లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) రుణాలను మాఫీ చేయడం, కొత్త పథకం కింద సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స వంటి అనేక చర్యలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం హామీ ఇచ్చారు.