మంత్రివర్గంలో సమర్ధుడైన వ్యక్తి కావడం వల్లనే భట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ, ఇంధన శాఖ ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కరెంట్ సమస్య కూడా చాలా క్లిష్టమైనది.. ఈ రెండు కష్టమైన కిరీటాలు భట్టికి అప్పగించారని తుమ్మల తెలిపారు. భట్టి విక్రమార్క పనితీరును వల్లనే ఆయనకి ఆ పదవులు ఇచ్చారని.. ఆయన అద్భుతంగా ఆ పదవిని నిర్వహిస్తారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎటువంటి అక్రమాలు లేకుండా కబ్జాలు లేకుండా చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు…
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్న అసెంబ్లీలో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీని సంబంధించి వ్యాఖ్యలు చేశారు. సీనియారిటీ కాదని ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్ ఎంఐఎంని ప్రొటెం స్పీకర్ చేసిందని విమర్శలు చేశారు. అందుకే బీజేపీ ప్రొటెం స్పీకర్ ఎంపికను వ్యతిరేకించిందని ఆరోపించారు. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలో రాజకీయం ఉందని తెలిపారు. ప్రభుత్వం ఎవరిపేరు పంపితే వారినే గవర్నర్ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తారని..…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు.
ప్రస్తుతం హాట్ టాప్ గా మారిన విషయం తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమెను బహిష్కరించడం. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారు అని ఆమె పైన వచ్చిన ఆరోపణలు నిజమని రుజువు కావడం చేత ఆమె తన పార్లమెంటులో తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు దర్శనాలలో భాగంగా క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల ఆశీస్సులు జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ లోని బషీర్‌బాగ్ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి యత్నించారు. ఆటోలో ఫైల్స్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే.. ఇదే కార్యాలయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది. కాగా.. ఆటోలో ఫైల్స్ తరలించడాన్ని అధికారులు గమనించి అడ్డుకున్నారు. దీంతో వారిని చూసి ఫైల్స్‌తో ఉన్న ఆటోను వదిలిపోయారు ఆగంతకులు.
సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే.హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్.రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి మంత్రికి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి…