ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ కలిశారు. ఈ సందర్భంగా.. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్యాక్రాంతమై, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలన్నీ ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో.. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసిందని వారు పేర్కొన్నారు. దరిద్రమైన ధరణి వెబ్ సైట్ ద్వారా ఖరీదైన భూముల వివరాలన్నీ అన్యక్రాంతం చేశారని జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి…
కాంగ్రెస్ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్ సభ్యులను కాదని అక్బరుద్దీన్ను ప్రొటెం స్పీకర్గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం మునుగోడులో బెల్ట్ షాపులు ఉండవని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. బెల్ట్ షాపుల వ్యవహారంలో ఎవరి మాట విననని అన్నారు. పదవి పోయినా బెల్ట్ షాపులను తెరవనివ్వనని కరాఖండిగా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి నిర్ణయమని అన్నారు.
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం MCR HRDIT ని సందర్శించి, ఫాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలు గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సీఎంతో పాటు.. మంత్రి సీతక్క పాల్గొన్నారు.
గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్.. నిర్దేశిత స్థలానికి కాకుండా ఓ ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి డీసీఎం వ్యాన్ వెళ్లింది. దీంతో.. విషయం తెలుసుకున్న జాలు బాయి తండావాసులు భారీగా తరలివచ్చారు. అనంతరం జేసీబీ సహాయంతో డీసీఎం వ్యానును బయటకు తీశారు.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందన్న కండక్టర్ వినలేదు. ఈ క్రమంలో.. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు బాధితులు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్ ను విధుల నుంచి ఆర్.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న…
తనకు ఇష్టం లేదన్న భర్త తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ హై కోర్టు ను ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మీద విచారణ జరిపిన హై కోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చింది.
రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.