UP women: ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను ఆకర్షితులను చేసే పథకాలు తప్పనిసరి. అలా వచ్చిందే ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం. మొదటిసారిగా కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది అక్కడి ప్రభుత్వం. ఇదే కోవలోకి తెలంగాణ కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన సంగతి అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ప్రచారంలో చెప్పినట్టుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం UP మహిళలు కూడా వాళ్లకు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాలలోకి వెళ్తే.. ఆగ్రా మరియు మధురలోని మహిళా సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్‌వే బస్సులలో ఉచిత ప్రయాణం చేయాలని డిమాండ్ చేశాయి.
Read also:Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ఉన్న సినిమాలే ముఖ్యం
కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి విజయవంతం అయ్యిందని UP మహిళలకు కూడా అలానే RTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి మహిళా కార్యకర్తలు ఒక మెమోరాండంలో మాట్లాడుతూ.. మహిళలకు RTC బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం వల్ల పని కోసం లేదా సందర్శనా కోసం బయటకు వచ్చిన తమకు నిజమైన సాధికారత అలానే సామాజిక భద్రత వస్తుందని అన్నారు. అస్తవ్యస్తమైన రంగం లోని శ్రామిక-తరగతి మహిళలు చాలా మంది సాధికారత పొందుతారని.. ప్రయాణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని.. ఎక్కువ మంది మహిళలు బయటకు రావడం వల్ల అందరికీ మెరుగైన మరియు సురక్షితమైన భద్రత ఉంటుందని పేర్కొన్నారు.