Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైంది ప్రభుత్వం.. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. రాజధాని పరిధిలోని అమరావతి మరియు తుళ్లూరు మండలాల్లో మొత్తం…