వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా అధికారులు నిరసన చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి.. జీవిత ఖైదు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పరిగి నియోజకవర్గంలోని తహసిల్దార్ కార్యాలయాలను మూసివేసి నిరసన తెలుపుతూ తహశీల్దారులు, రెవెన్యూ సిబ్బంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు…