‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో విజయం సాధించిన నటుడు తిరువీర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మహేశ్వరరెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. పూర్తిగా వినోదభరితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం…
సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ కొత్త చిత్రం ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. ఇది వారి బ్యానర్‌కు ప్రొడక్షన్ నంబర్ 1, సుధీర్ ఆనంద్‌కు హీరోగా ఐదవ చిత్రం కాగా గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో శివాజీ విలన్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి హైలెస్సో అనే ఆకట్టుకునే టైటిల్…
నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు హీరోగా నటిస్తున్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వై.వి.ఎస్.చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. 'న్యూ టాలెంట్ రోర్స్' పతాకంపై ఆయన సతీమణి గీతఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఎన్టీఆర్ సరసన వీణారావు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నందమూరి మోహనకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.