‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో విజయం సాధించిన నటుడు తిరువీర్ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా, ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రాన్ని గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మహేశ్వరరెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్ అయింది. పూర్తిగా వినోదభరితమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నెల 19వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది. చిత్రానికి టెక్నికల్ టీమ్‌లో సీహెచ్ కుషేందర్ ఛాయాగ్రాహకుడు, భరత్ మంచిరాజు సంగీత దర్శకుడు, తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌గా, శ్రీవరప్రసాద్ ఎడిటర్‌గా, పూర్ణాచారి సాహిత్యాన్ని అందిస్తున్నారు. మరిక తిరువీర్ – ఐశ్వర్య రాజేశ్ జంట స్క్రీన్‌పై ఎలా కనెక్ట్ అవుతారో చూడటానికి అభిమానులు ఇప్పటికే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.