చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కు తెలుగు తమ్ముళ్లు వరుసగా ఆహ్వానాలు పంపుతున్నారు. తమ జిల్లాల్లో పర్యటనలు చేయాలని కోరుతున్నారట. దీనికి ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ జిల్లా పర్యటనలకు వస్తానని వారందరికీ అభయం ఇస్తున్నారట. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే చర్చ టీడీపీలోనే జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేష్ ను టీడీపీ నేతలు మచ్చిక చేసుకుని సీటును…
టీడీపీ అధికారానికి దూరమై దాదాపు రెండున్నేళ్లు కావస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీలో ఎంతమంది ఉన్నారనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఇదిలా ఉంటే.. ఆపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన నేతలంతా మిన్నకుండిపోతున్నారు. దీనికితోడు సొంత పార్టీపైనే బహిరంగంగా విమర్శలు చేస్తూ అభాసు పాలవుతున్నారు. కొద్దిరోజులుగా టీడీపీలోని కొందరు సీనియర్లు అధినేతపై ధిక్కార స్వరాన్ని విన్పిస్తుండటం…
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతేడాది వైరస్ బారిన పడి స్వర్గస్తులయ్యారు. 2020, ఆగస్టు 5 తేదీన కరోనా వ్యాధి బారినపడ్డ బాలు.. చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాడిన వేలాది పాటలతో మనందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని అభిమానులు ఆయన్ను స్మరించుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆయనను గుర్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను అంటూ ట్వీట్…
ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట. దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా? కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన…
(సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి) తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నందమూరి హరికృష్ణ నిలిచారు. మహానటుడు నటరత్న యన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. అందులో బాలకృష్ణునిగా హరికృష్ణ ముద్దుగా మురిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించినా, ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారారు హరికృష్ణ. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణంపైనే దృష్టిని కేంద్రీకరించిన హరికృష్ణ దాదాపు 21 సంవత్సరాలకు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. అనూహ్యంగా కొన్ని సినిమాల్లో…
దివంగత నందమూరి హరికృష్ణ మూడవ వర్థంతి సందర్భంగా ఏపీలోని ఆయా జిల్లాల టీడీపీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులర్పించారు. విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో హరికృష్ణ చిత్రపటానికి మూలమాల వేసిన టీడీపీ నేతలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. పార్టీకి, సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలోను హరికృష్ణ వర్థంతి కార్యక్రమం జరగింది. ఈ వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. హరికృష్ణ…
ఏదైనా సమస్య వస్తే నాయకుడి దగ్గరకు కేడర్ వెళ్లడం సాధారణం. పార్టీ పవర్‌లో ఉన్నా.. లేకపోయినా.. శ్రేణులకు అందుబాటులో ఉన్న నేతలే దేవుళ్లు. ఆ జిల్లాలో మాత్రం కేడర్‌ను, పార్టీని పట్టించుకునే వాళ్లు లేరు. తమ్ముళ్లు దిక్కులేని వారిగా మారిపోయారు. అధినేత ఎప్పుడు కరుణిస్తారా అని రెండేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో దిక్కులేకుండా పోయిన టీడీపీ కేడర్! చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు ఈ దఫా పెద్దకష్టమే వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత…
నిన్న మొన్నటిదాకా అంటీ ముట్టనట్టున్నాడు. ఇప్పుడు జస్ట్.. చిన్న పిలుపురాగానే అటెండెన్స్ వేయించుకున్నాడట. ఓ దశలో కండువా మార్చేస్తారనే టాక్ కూడా నడిచింది. అంతలోనే ఊహించనంత మార్పు.. దీంతో ఆ మాజీ మంత్రిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగాహానాలు చక్కర్లు కొడుతున్నాయట. రాజకీయాలు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో.. ఊహించలేని పరిస్థితి. కొందరిపై ఏళ్ల తరబడి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, పార్టీ మారరు. వేరే జెండా ఎత్తరు. ఉన్న పార్టీలోనే ఎత్తు…
అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్ దారి తప్పుతోందట. మేయర్ ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట. గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన…
మాజీ మంత్రి ఎల్.రమణ శుక్రవారం తెలంగాణ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా రమణ ప్రకటించారు. దీంతో టీ-టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. కాగా నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జీలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. టీటీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా…