విలక్షణం… నందమూరి హరికృష్ణ మారుపేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ జయంతి)
తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నందమూరి హరికృష్ణ నిలిచారు. మహానటుడు నటరత్న యన్టీఆర్ తన తనయుల్లో మూడవవాడైన హరికృష్ణను బాలనటునిగా ‘శ్రీకృష్ణావతారం’లోనే పరిచయం చేశారు. అందులో బాలకృష్ణునిగా హరికృష్ణ ముద్దుగా మురిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించినా, ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారారు హరికృష్ణ. అప్పటి నుంచీ చిత్ర నిర్మాణంపైనే దృష్టిని కేంద్రీకరించిన హరికృష్ణ దాదాపు 21 సంవత్సరాలకు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. అనూహ్యంగా కొన్ని సినిమాల్లో హరికృష్ణ హీరోగానూ విజయాలను సాధించారు. రాజకీయాల్లోనూ హరికృష్ణ తనదైన పాత్ర పోషించారు. తండ్రి యన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్ నియోజకవర్గం నుండి 1996లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందు చంద్రబాబు మంత్రివర్గంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గానూ పనిచేశారు. 2008లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
Also Read
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
యన్టీఆర్ తనయుల్లో అప్పట్లో హరికృష్ణ భలే వేగం చూపించేవారు. దానిని పసికట్టి యన్టీఆర్ తన ‘శ్రీకృష్ణావతారం’లో బాలకృష్ణునిగా నటింప చేశారు. తరువాత యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘తల్లా?పెళ్ళామా?’లోనూ హరికృష్ణ కీలక పాత్ర పోషించారు. ఇందులోనూ శ్రీకృష్ణుని గెటప్ లో అలరించారు. హరికృష్ణ తమ్ముడు బాలకృష్ణ నటించిన తొలి సినిమా ‘తాతమ్మకల’లో యన్టీఆర్ కు తనయునిగా, బాలయ్యకు అన్నగా నటించారు. హరికృష్ణ తమ్ముడు బాలయ్యతో కలసి ‘రామ్-రహీమ్’లోనూ మురిపించారు. ఇక తన తండ్రి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘దానవీరశూర కర్ణ’లో అర్జునునిగా అభినయించారు. ఆ సినిమా తరువాత తండ్రి హీరోగా నటించిన ‘డ్రైవర్ రాముడు’తో నిర్మాతగా మారి, తమ రామకృష్ణ సినీస్టూడియోస్, తారకరామా ఫిలిమ్ యూనిట్ నిర్మించే చిత్రాల నిర్మాణ వ్యవహారాలు చూసుకున్నారు. నైజామ్ ఏరియాలో యన్టీఆర్ పంపిణీ సంస్థ ‘రామకృష్ణ డిస్ట్రిబ్యూటర్స్’ను కూడా హరికృష్ణ నిర్వహించేవారు. తమ్ముడు బాలకృష్ణ హీరో అయిన తరువాత “పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరగబడ్డ తెలుగుబిడ్డ, పెద్దన్నయ్య” వంటి చిత్రాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
నటనకు దూరంగా ఉన్న హరికృష్ణతో ‘శ్రీరాములయ్య’లో ఓ కీ రోల్ పోషింప చేశారు దర్శకుడు ఎన్.శంకర్. అందులో హరికృష్ణపై చిత్రీకరించిన ‘నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా…’ పాట అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తరువాత వైవిఎస్ చౌదరి తన ‘సీతారామరాజు’లో హరికృష్ణను, ఏయన్నార్ నటవారసుడు నాగార్జునను కలిపి తెరకెక్కించారు. ఇద్దరు మహానటుల వారసుల చిత్రం కాబట్టి, ఈ సినిమా జనాన్ని అలరించింది. ఆ తరువాత వైవిఎస్ చౌదరి తమ సొంత బ్యానర్ బొమ్మరిల్లు పతాకంపై హరికృస్ణ హీరోగా ‘లాహిరి లాహిరి లాహిరిలో…’, ‘సీతయ్య’ మంచి విజయం చూశాయి. అనూహ్యంగా ఆ సమయంలో హరికృష్ణకు స్టార్ డమ్ లభించింది. “టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి” వంటి చిత్రాల్లోనూ హరికృష్ణ నటునిగా మురిపించారు. కృష్ణతో కలసి హరికృష్ణ నటించిన ‘శ్రావణమాసం’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తరువాత మళ్ళీ హరికృష్ణ కెమెరా ముందుకు రాలేదు.
హరికృష్ణకు ముగ్గురు కుమారులు జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారకరామ్. వీరిలో కళ్యాణ్, తారక్ ఇద్దరూ నటనలో రాణిస్తున్నారు. వీరిద్దరితో కలసి హరికృష్ణ నటిస్తారని చాలా రోజులు వినిపించింది. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తనయుల విజయం చూస్తూ, మనవడు మరో యన్టీఆర్ ను ‘దానవీరశూరకర్ణ’ బాలల చిత్రంలో చూసి పొంగిపోయారు హరికృష్ణ. ఆయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. తరువాత నాలుగేళ్ళకే హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించడం విచారకరం. తెలుగు చిత్రసీమలో నటవారసుల ప్రస్తావన వచ్చిన ప్రతీసారి హరికృష్ణ పేరు వినిపిస్తూనే ఉంటుంది.
తాజావార్తలు
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!