గుడివాడలో క్యాసినో వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానిని ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయగా… ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో క్యాసినో జరగకపోయినా జరుగుతోందని 420 గాడు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని పరుషంగా మాట్లాడారు. కులసంఘాలను, 420 మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం…
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి లేఖ రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రైల్వే స్థలాలకు సంబంధించిన అంశంపై జగన్‌కు లోకేష్ లేఖ రాశారు. తాడేపల్లిలో రైల్వేస్థలాల్లో నివసిస్తున్న పేదవారికి గతంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు… వేరేచోట ఇళ్లు కట్టేవరకు రైల్వే అధికారులు ఇళ్లు కూల్చకుండా సమయం ఇచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. Read Also: భారీగా పెరిగిన సెంట్రల్ విస్టా…
తెలుగు దేశం పార్టీకి కరోనా టెన్షన్ పట్టుకుంది. ఆ పార్టీలో సీనియర్ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ముందుగా టీడీపీ అధినేత తనయుడు నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా… ఒక్కరోజు తేడాలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కరోనా వలలో చిక్కుకున్నారు. అంతకుముందు కూడా పలువురు టీడీపీ నేతలు కరోనా బారిన పడ్డా… ఇప్పుడు వరుసగా సీనియర్ నేతలకు కరోనా సోకడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత,…
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సందర్భంగా స్కూళ్లకు సెలవులు పొడిగించాలని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు తాను లేఖ రాశానని లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయని ఏపీ ప్రభుత్వానికి లోకేష్ గుర్తు చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించాయని లోకేష్ వివరించారు. Read Also: విద్యార్థులకు అలర్ట్..…
గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి అరవింద్‌బాబుపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ బాబు ఆరోగ్య పరిస్థితిపై నేతలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై నిరసనలు తెలిపితే పోలీసులతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ప్రశ్నించిన అరవింద్‍బాబు, ఇతర నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం వారి వైఖరికి నిదర్శనమన్నారు. టీడీపీ శ్రేణులపై వైసీపీ…
గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం మాయమైన ఘటనకు సంబంధించి ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలో నర్సరావుపేట టీడీపీ ఇంఛార్జి చదలవాడ అరవింద్‌బాబు కూడా పాల్గొన్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో టీడీపీ నేత చదలవాడ అరవింద్‌బాబు సృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. Read…
టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ ఈ-పేపర్‌ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా టిక్కెట్ల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అనవసరంగా సినిమా టిక్కెట్ల వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని… టీడీపీకి సినిమా పరిశ్రమ సహకరించిన దాఖలాలు లేవన్నారు. సీఎంగా ఉన్నప్పుడు, ఇటీవల తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు గుర్తుచేశారు. రాజకీయ పార్టీ పెట్టకముందు… ఆ తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని… కానీ 2009లో చిరంజీవి తనకు సహకరించి ఉంటే అప్పుడు…
ఏపీ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. ఏపీలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యలు ప్రభుత్వానికి కనిపించడంలేదా అని పయ్యావుల కేశవ్ నిలదీశారు. ఏ సమస్య లేదు అన్న తరహాలో సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని సూటిగా ప్రశ్నించారు. Read Also: చట్టప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు: మంత్రి పేర్ని…
జనసేనతో పొత్తును ఉద్దేశిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ‘వన్ సైడ్ లవ్’ వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ‘రాజకీయ పార్టీల మధ్య పొత్తులను లవ్ అఫైర్ల స్థాయికి దిగజార్చాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు రోడ్ సైడ్ రోమియోలా వెంటపడ్డా నిన్ను ఏ సైడ్ నుంచీ జనం లవ్ చేయరు బాబూ. నిన్ను లవ్ చేసేది పచ్చ…
★ చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు మూడో రోజు చంద్రబాబు పర్యటన… నేడు శాంతిపురం మండలంలో పర్యటించనున్న చంద్రబాబు★ అమరావతి: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మౌన దీక్షలు… పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రతపై ప్రభుత్వ తీరుకు నిరసనగా గాంధీ విగ్రహాల వద్ద బీజేపీ నేత మౌన దీక్ష★ ఏపీలో నేడు రైతు సమస్యలపై టీడీపీ నిరసనలు… ‘విత్తనం నుంచి విక్రయం దాకా దగాపడ్డ రైతన్న’ పేరుతో నిరసనలు చేపట్టనున్న టీడీపీ.. నిరసనల్లో పాల్గొననున్న తెలుగు రైతు…