ఏపీలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలతో టీడీపీ అధిష్టానం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా హాజరుకావాల్సి ఉంది. అయితే చంద్రబాబుతో సమావేశానికి గంటా హాజరుకాలేదు. త్వరలో వచ్చి చంద్రబాబును కలుస్తానని టీడీపీ కార్యాలయానికి గంటా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో రాలేకపోతున్నానని గంటా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. Read Also:…
ఏపీలో టీడీపీ ఇంఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. మొత్తం 12 మందిని శుక్రవారం జరిగే సమావేశానికి రావాలని టీడీపీ అధిష్టానం ఆదేశించింది. ఈ జాబితాలో విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో గంటా క్రియాశీలకంగా లేరు. అయితే ఓ సారి బీజేపీలో చేరుతారని.. మరోసారి వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని అటు ఖండించలేక.. ఇటు అంగీకరించలేక గంటా సైలెంట్‌గానే ఉన్నారు. మధ్యలో…
అమరావతిలోని టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. పార్టీ అనుబంధ కమిటీల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగి ఉపయోగం లేదన్నారు. Read Also: Andhra Pradesh: అండర్-19 క్రికెటర్‌పై ఏపీ సీఎం…
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకూ పోరాటం ఆపేది లేదని ప్రకటించిన కార్మికులు అదే స్ఫూర్తితో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి ఏడాది గడుస్తోన్న నేపథ్యంలో దీనిపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. ఏడాదిగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు చేస్తున్నానని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పార్లమెంటు వరకు తమ పార్టీ…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా…
ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల సమావేశంపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు చేశారు. సమస్యను ఉద్దేశపూర్వకంగా సృష్టించి, మళ్లీ ఆ సమస్యను పరిష్కరించినట్లు సీఎం జగన్ బిల్డప్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు ఎవరు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించమన్నారు? ఎవరు పెంచమన్నారు వైఎస్ జగన్? మీరే సమస్యను సృష్టించి మీరే పరిష్కరించినట్లు డైవర్షన్ పాలిట్రిక్స్ చేయడం మీకే చెల్లింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాను గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును పరామర్శించేందుకు సీఐడీ కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. అశోక్‌బాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమా సహా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, బుచ్చి రాంప్రసాద్, పిల్లి మాణిక్యాలరావు,…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై నిలదీస్తున్నందుకే.. ప్రభుత్వం కక్ష గట్టి అరెస్ట్ చేయించిందని ఆరోపించారు. అసలు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని… సర్వీస్ మేటర్స్లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ప్రతి తప్పుకు త్వరలోనే మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు అరెస్టుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా…
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును గురువారం అర్ధరాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు అశోక్బాబు ఇంటికి సీఐడీ సీఐ పెద్దిరాజు నోటీసు అంటించారు. అశోక్బాబుపై గతంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో 477(ఎ), 466, 467, 468,…