సోషల్ మీడియాలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా ఉంటారు. నిత్యం ఆయన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో టిక్కెట్ రేట్లు ఎందుకు పెంచరంటూ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయగా.. ఇప్పుడు టిక్కెట్ రేట్లు పెంచాక ఆయన ఎందుకు…
ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు పెదవి విరిచారు. సంక్షేమ పథకాలన్నీ సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. పాత పథకాలకు పేరు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రభుత్వం ఆధారపడుతోందని.. అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం గురించి జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబుతో జతకట్టి చేతులు పైకెత్తిన పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో కళ్లు తేలేశాయని.. చంద్రబాబు ఐరన్ లెగ్ కారణంగానే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పార్టీ కళ్లు తేలేసిందని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యూపీలో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీతో మళ్లీ జత కట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో అఖిలేష్‌తో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో విద్యా శాఖకు సంబంధించిన ఓ పథకాన్ని మంత్రి ఆదిమూలపు సరేష్ ప్రస్తావించారు. ఈ వీడియోను ఆధారం చేసుకుని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దీంతో మంత్రి సురేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విద్యా శాఖకు సంబంధించి తాము పాత పథకాన్నే కొనసాగిస్తున్నామని.. ఆ పథకాన్ని జగన్ తీసుకొచ్చారంటూ…
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణాలకు ముప్పు ఉందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సాయుధ బలగాలతో భద్రత కల్పించాలంటూ ఆయన లేఖలో కోరారు. చంద్రబాబుకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందని లేఖలో వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యాలయాన్ని సందర్శించే నాయకులకు సైతం తీవ్రవాదులు, సంఘ…
ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స మరోసారి స్పందించారు. 2024 వరకు ఏపీకి రాజధాని హైదరాబాద్ అని ఆయన వ్యాఖ్యానించగా టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీంతో టీడీపీ నేతలపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పొడుగు కావడం కాదు.. కొంచెం బుర్ర పెరగాలి అంటూ అచ్చెన్నాయుడిని ఉద్దేశించి బొత్స ఫైర్ అయ్యారు. చంద్రబాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండి ఎంజాయ్ చేస్తారు కానీ తాము హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే మాత్రం టీడీపీ…
ఏపీ రాజధాని విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏపీకి మూడు రాజధానులు అనే వైసీపీ ప్రభుత్వం చెప్పిందని.. తాజాగా మూడు రాజధానులు పోయి.. నాలుగో రాజధాని హైదరాబాద్ కూడా వచ్చి చేరిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో తనకు అన్ని విధాలుగా ఉపయోగపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవడానికి జగన్ ఏపీని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని ఆరోపించారు.…
అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 25 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమైంది. సభా నాయకుడి హోదాలో సీఎం జగన్, సభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, వైసీపీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కురసాల కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆర్ అండ్ ఆర్ అడిగిన రైతులపై కేసులు పెట్టిన చరిత్ర టీడీపీది అని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. చంద్రబాబు ఎప్పటికీ రైతు బంధు కాలేడని.. ఆయన రైతు రాబంధు అని అభివర్ణించారు. అమరావతిలో రైతుల పేరుతో కొందరు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని టీడీపీని ఉద్దేశించి మంత్రి కన్నబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమరావతితో పాటు అన్ని…