ఏపీ సీఎం జగన్‌పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు. టీడీపీని చూస్తేనే జగన్ భయపడుతున్నారని.. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి మద్యం పాలసీపై జగన్ ప్రకటన చేశారని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. సభలో టీడీపీ సభ్యులు ఉండే వాస్తవాలు బయటకు వస్తాయని సస్పెండ్ చేశారన్నారు. ప్రతిపక్ష నేతగా మద్య నిషేధంపై ఊరూరా తిరిగి హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక రూ.6వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని…
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ…
ఏపీలో ప్రస్తుతం కల్తీ మద్యం, కల్తీ సారాపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై మంత్రి అప్పలరాజు తీవ్ర విమర్శలు చేశారు. పచ్చపార్టీ వాళ్లు లిక్కర్ బ్రాండ్లపై ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ, గవర్నర్స్ రిజర్వ్ విస్కీ వంటి మద్యం బ్రాండ్‌లకు 2018 ఫిబ్రవరి 6న అప్పటి సీఎం చంద్రబాబే అనుమతులు ఇచ్చారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. భూమ్.. భూమ్ బీర్ కంపెనీకి 2019…
కర్నూలులో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ భేటీలో పలువురు బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో చెప్పేందుకు వైసీపీ మంత్రులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. ఏపీపై ప్రత్యేక ప్రేమతో దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులను కేంద్రం ఏపీకి ఇస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ…
ఏపీలో ఇటీవల ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు. తాజాగా టీడీపీ నేతలు బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలవబోతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. త్వరలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు తమ పిల్లలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు. జస్వంతి, సిద్ధార్థ్ ఇద్దరూ…
ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత కొడాలి నాని, టీడీపీ నేత వంగవీటి రాధా ఇద్దరూ క్రేజ్ ఉన్న నేతలే. వేర్వేరు పార్టీలకు చెందిన వారైనా వీరిద్దరూ తమ స్నేహాన్ని కొనసాగిస్తుంటారు. సాధారణంగా వైసీపీ, టీడీపీ నేతలు అనేక అంశాలపై ఆరోపణలు చేసుకోవడం మాములే. కొడాలి నాని నిత్యం చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటారు కూడా. ప్రతిగా టీడీపీ నేతలు కూడా కొడాలి నానిని టార్గెట్ చేస్తుంటారు. కానీ కొడాలి నాని, రాధా అనుబంధంపై ఈ మాటల…
శ్రీకాకుళం జిల్లా పోలాకి, చెల్లాయి వలసలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలకు ధర్మాన కృష్ణదాస్ సవాల్ విసిరారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకుండా తన ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తానని…
ఏపీ అసెంబ్లీలో సోమవారం గందరగోళం నెలకొంది. ప.గో. జిల్లా జంగారెడ్డిగూడెం సారా మరణాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకున్నారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. వారిని సభ నుంచి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగడం జరుగుతోంది. జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ పలుమార్లు సభను వాయిదా వేశారు. అయితే ఈ అంశంపై చర్చించాల్సిందేనని టీడీపీ నేతలు పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేపట్టారు. సభలో టీడీపీ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మద్యపాన నిషేధం గురించి…
ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం కొనసాగనున్నాయి. ఈరోజు బడ్జెట్పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. అటు అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల బిల్లుతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ పెంపు బిల్లు, మద్యం అమ్మకాల చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మరోవైపు మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాల తీర్మానంపై జరిగే చర్చలో సీఎం జగన్ పాల్గొననున్నారు. కాగా అసెంబ్లీలో నేడు జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై సభలో టీడీపీ వాయిదా తీర్మానం…