బ్యాంక్ ఆఫ్ బరోడా 114 సంవత్సరాలు పూర్తి చేసుకుని 115వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న శుభసందర్భంగా బ్యాంకు స్ట్రీట్ శాఖ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు మౌలాలిలో గల షాలోమ్ వృద్ధుల ఆశ్రమానికి రూ.25 వేల నిలువ గల వాషింగ్ మెషీన్‌ను బ్యాంకు సిబ్బంది అందజేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా వీఆర్ఏల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైనదని.. వారికి ప్రభుత్వం తక్షణమే పే స్కేల్, ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరి పీల్చుకుంటున్న నగరవాసులకు మళ్లీ కరోనా కలవరపెడుతోంది. భారీ వానలకు మళ్లీ కరోనా కోరలుచాస్తోంది. రోజురోజుకు కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి దాకా వందలో ఉన్న కేసులు తాజాగా 700 దాటాయి. భాగ్యనగరంలోని నార్కట్‌పల్లి గురుకుల కళాశాలలో కరోనా కలకలం రేపింది. నల్గొండ జిల్లాలోని విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. కాగా.. నార్కట్‌పల్లిలోని గురుకుల కళాశాలలో 15 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. విద్యార్థి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బోనాల పండుగలో గ్రూప్ రాజకీయాలు సృష్టించొద్దని, ఎవరైనా గొడవలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. హైదరాబాద్ పాతబస్తీ సుల్తాన్ షాహీ శ్రీ జగదాంబ అమ్మవారి దేవాలయం వద్ద ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీతో పాటు పాతబస్తీ పరిధిలో ఉన్న ఇతర దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వ తరఫున మంత్రి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రైవేటు దేవాలయాలకు సైతం ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ…
* నేడు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్, వెస్టిండీస్‌తో 3 వన్డేలు ఆడనున్న టీమిండియా * నేడు శ్రీశైలానికి ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. రేపు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్న అంబటి * నేడు కోనసీమ జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన, ఆత్రేయపురం, వానపల్లి వరద బాధితులను పరామర్శించనున్న సోమువీర్రాజు * ఢిల్లీలో…
వినాయక చవితి రాబోతోంది.. ఊరువాడ.. చిన్నా పెద్దా ఉత్సాహంగా వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, హైదరాబాద్‌కు వినాయక చవితి ఉత్సవాలకు.. నవరాత్రి పూజల తర్వాత నిర్వహించే నిమజ్జనానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. అయితే, వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని తెలిపింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి గుంటల్లోనే…
మరో నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్పీ)... ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ భర్తీకి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది
Fake Organic Fertilizers In Yadadri Bhongir District: యాదాద్రి భువనగిరి జిల్లాలో నకిలీ ఆర్గానిక్ ఎరువుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో ఆర్గానికి ఎరువులని చెప్పి.. రైతుల (30-40 మంది) నుంచి అక్షరాల రూ. 3 లక్షలు దోచేశారు. ఆదిత్య ఆర్గానిక్ పేరుతో ఓ నకిలీ ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. తమ దగ్గరున్న ఎరువులు కిసాన్ గోల్డ్ మ్యానుఫ్యాక్టర్వి అని నమ్మించి, ఈకో టెక్నాలజీతో జీఎస్టీ లేకుండా బిల్లులు…