Bandi Sanjay: కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా వీఆర్ఏల ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ మద్దతు ప్రకటించారు. వీఆర్ఏల ఆందోళన న్యాయబద్ధమైనదని.. వారికి ప్రభుత్వం తక్షణమే పే స్కేల్, ప్రమోషన్ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హామీ ఇచ్చి ఉద్యోగులను ప్రగతి భవన్ పిలిచి భోజనం పెట్టి మాట తప్పిన దుర్మార్గుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న వీఆర్ఏలను కాల్చిపారేస్తానన్న సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్చిపారేసుకుంటూ పోతే కేసీఆర్, ఆయన కుటుంబం మినహా రాష్ట్రంలో ఏ ఒక్కరూ మిగలరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు ఇచ్చిన మాట తప్పి ముఖం చెల్లక కేసీఆర్ ప్రగతి భవన్‌కే పరిమితం కావడం సిగ్గు చేటన్నారు.
Minister KTR: ఆ రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలి.. ముర్ముకు కేటీఆర్ విజ్ఞప్తి
కేసులు, లాఠీ దెబ్బలకు భయపడకుండా ఉద్యోగుల పక్షాల పోరాడుతూ జైలు కెళ్లింది బీజేపీ నాయకులేనని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణలో వీఆర్‌ఏల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 22 వేల మంది వీఆర్ఏలుహా సేవలందిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారిందని వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు.