ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా…
* నేడు తిరుపతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన.. స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో దివంగత రాస్ మునిరత్సం విగ్రహావిష్కరణ, మహాత్మగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణలో పాల్గొననున్న సీజేఐ * ప్రకాశం : మార్కాపురం మండలం రాయవరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి. * ప్రకాశం : కనిగిరి మున్సిపాలిటీ 9వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే…
షెకావత్ జీ.. మీ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తొస్తోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతి పై చర్యలకు కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారని ప్రశ్నించారు. మాటలు సరే చర్యల సంగతి చెప్పండి సార్! అంటూ ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి విమర్శల గుప్పించారు. ట్విటర్ వేదికగా ఆయన పలు వార్తాపత్రికల పేపర్లను ఆయన సోషల్…
మునుగోడు ఉప ఎన్నిక అక్కడి ప్రజలు కోరుకుంటే రాలేదు..! అక్కడి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో గెలుస్తామని, 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని జాతీయ పార్టీలు కలలు కంటున్నాయని ఎద్దేవ చేశారు. అది జరగదని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడేళ్లలోనే మూడు ఉపఎన్నికలు వచ్చాయన్నారు. హుజూర్నగర్, నాగార్జున సాగర్‌లలో ఉపఎన్నికలు…
* ఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం * హైదరాబాద్: నేడు లా సెట్, పీజీ లా సెట్ ఫలితాలను విడుదల చేయనున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి * హన్మకొండ: నేడు పరకాల బంద్‌కు బీజేపీ పిలుపు, బీజేపీ నేత గురుప్రసాద్‌పై దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన పార్టీ * నేడు మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన, మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న తెలంగాణ సీఎం * భద్రాచలం…