Producer SKN: ఎస్కేఎన్ స్పీచ్‌లు చూడడం మానెయ్.. ‘నారీ నారీ నడుమ మురారి’లో ప్రొడ్యూసర్ డైలాగే హైలెట్!
- టాలీవుడ్ నయా ట్రెండ్ స్పీకర్ ఎస్కేఎన్
- స్టేజ్ ఎక్కితే వైరల్ స్పీచ్ ఖాయం
- ఎస్కేఎన్ స్పీచ్‌లు చూడడం మానెయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సరే.. చీఫ్ గెస్ట్‌గా నిర్మాత ఎస్కేఎన్ ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. స్టేజ్‌పై అడుగుపెట్టి మైక్ అందుకున్నాడంటే చాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్పీచ్ ఇవ్వకుండా స్టేజ్ దిగడనే చెప్పాలి. ఇటీవల పలు సినిమా ఈవెంట్‌లలో ఎస్కేఎన్ చేసిన స్పీచ్‌లు విపరీతమైన చర్చకు దారి తీసాయి. యంగ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ తన మాటలతో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అభిప్రాయాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు వివాదాలకు కూడా దారి తీశాయి. అయితే అదే ఆయనకు మరింత పాపులారిటీని తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇప్పుడు స్టేజ్‌ల వరకే కాదు.. ఏకంగా సినిమాల్లో కూడా ఎస్కేఎన్ పేరు ప్రస్తావించబడుతోంది. తాజాగా విడుదలైన ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో ఎస్కేఎన్‌ను వాడారు. ట్రైలర్‌లో వెన్నెల కిషోర్ చెప్పిన ‘ఎస్కేఎన్ స్పీచ్‌లు చూడడం మానేయ్’ అనే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇది ఎస్కేఎన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఓ నిదర్శనం. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం నారీ నారీ నడుమ మురారి. రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
- Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
- Kareena Kapoor: మూడోసారి గర్భవతా?.. వైరల్ రూమర్స్‌పై కరీనా కపూర్ ఫన్నీ రియాక్షన్!
మరోవైపు నిర్మాతగా కూడా ఎస్కేఎన్ తనదైన ముద్ర వేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమాను అన్ని తానై చూసుకుంటున్నారు. ప్రమోషన్ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు. ఈ యంగ్ ప్రొడ్యూసర్ స్పీచ్‌లతోనే కాదు.. తన పని తీరుతో కూడా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తున్నారు. మొత్తంగా స్టేజ్‌పై మాటలతో హంగామా సృష్టించడంలోనూ, సినిమాల నిర్మాణంలోనూ ఎస్కేఎన్ ఇప్పుడు టాలీవుడ్ నయా ట్రెండ్ సెట్టర్‌గా మారాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
-
NBK 111 : బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఒకే హిందూ కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్య?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
-
Toxic Mallareddy Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్లక్ష్యంగా మల్లారెడ్డి యూనివర్సిటీపై కేసు నమోదు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!