గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్‌లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అవార్డుల పంటపండింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో అద్భుత ప్రదర్శనతో దేశంలో అత్యుత్తమంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది
ఎంఎన్‌జే క్యాన్సప్ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు.. ఎంపీ విజయేంద్ర ప్రసాద్, డాక్టర్ శరత్‌తో కలిసి సందర్శించారు. ఆసుపత్రి పెండింగ్ పనులు, కొత్త బిల్డింగ్ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
కేసీఆర్ అబద్ధాల గురించి ఎన్ని చెప్పినా తక్కువేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజావ్యతిరేక నరహంతక తెరాస ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని ఆదిలాబాద్ జిల్లాలోని గిమ్మ గ్రామంలో ఆయన వ్యాఖ్యానించారు.
విద్యుత్ రంగాన్ని ప్రవేటుపరం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చిందన్నారు. ఎందుకు కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తోందని ప్రశ్నించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హెచ్‌సీఏ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
Gymkhana Stadium: జింఖానా మైదానంలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. HCA ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టికెట్ల విక్రయాలపై పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు HCAకు నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. జింఖానా గ్రౌండ్ లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని HCAపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు.…