బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి వచ్చిన ఇంటెలిజెన్స్ పోలీసులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలోకి ఎలా వస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదా? అని తీవ్రంగా మండిపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని గాంధీ పార్కులో గల గాంధీ విగ్రహానికి పూలమాల వేసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించారు. గాంధీ ఆశయాల కోసం కృషి చేద్దామని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు.
గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అక్టోబర్ 24 నుండి తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది.
ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తు్న్నారు. తెలంగాణ షూటర్ ఇషాసింగ్, ఆంధ్రపదేశ్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి స్వర్ణాలు గెలిచారు.
తెలంగాణ మంత్రి హరీష్రావు… తాజాగా ఏపీ సర్కార్, అక్కడి టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్లు చేశారు.. అయితే, హరీష్రావు కామెంట్లపై కౌంటర్ ఎటాక్కు దిగారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్ర ఆదాయాలు తక్కువగా ఉన్నా అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు.. మా రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు, అర్హత హరీష్ రావుకు, కేసీఆర్కు లేదన్న…
మిషన్ భగీరథకు జాతీయ అవార్డుపై కేంద్ర జల శక్తి శాఖ స్పందించింది. మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడం అబద్దమని కేంద్రం వెల్లడించింది. ఆ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని జలశక్తి శాఖ వెల్లడించింది.