మహిళలు ఎక్కడున్నా.. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు తప్పడంలేదు.. పసికూనల నుంచి పండు ముసలి వరకు ఎవ్వరినీ వదలడంలేదు కామాంధులు.. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి.. అయితే, తాజాగా, చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథంపై బదిలీ వేటు వేసింది జైళ్ల శాఖ.. జైలులో ఉన్నవారిని కలిసేందుకు, చూసేందుకు సాధారణంగా ములాకత్కు వస్తుంటారు.. ఖైదీల కుటుంబ సభ్యులు.. అయితే, ములాకత్కు వచ్చే ఖైదీల భార్యలను వేధిస్తున్నాడని దశరథంపై ఆరోపణలు వచ్చాయి.. దీంతో,…
డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది విద్యాశాఖ.. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చిన విద్యాశాఖ.. తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని.. రాజగోపాల్ రెడ్డి కంపెనీల నుంచి వేరే వ్యక్తులకు రూ.5.24 కోట్లు బదిలీ అయ్యాయంటూ టీఆర్ఎస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంది ఎన్నికల కమిషన్..
What’s Today: • హైదరాబాద్లో నేడు రాహుల్ గాంధీ పాదయాత్ర.. పురానాపూల్, చార్మినార్, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఐమ్యాక్స్ మీదుగా సాగనున్న రాహుల్ పాదయాత్ర • రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా హైదరాబాద్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సౌత్ జోన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు • కర్నూలు: నేడు రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్..…
Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో…
అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. అట్టారో ఇండియా కంపెనీ రాష్ట్రంలో రూ. 600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది.
కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టుకోవచ్చు.. ఇంటర్నేషనల్ పార్టీ కూడా పెట్టొచ్చు.. అంతేకాదు చైనాలో కూడా పోటీ చేయొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. బీఆర్ఎస్.. అమెరికా, చైనాలోనూ పోటీ చేసుకొవచ్చని.. కానీ, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు