KTR: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. సంతోషం వ్యక్తం చేసిన ఐటీ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓవైపు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు ప్రైవేట్ రంగంలోనూ పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టిసారించింది.. ఇప్పటికే పలు మార్లు విదేశాల్లో తిరుగుతూ పెట్టుబడులను ఆహ్వానిస్తూ వచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తాజాగా, రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది.. అట్టారో ఇండియా కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.. అట్టారో ఇండియా కంపెనీ రాష్ట్రంలో రూ. 600 కోట్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది.. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నానని పేర్కొంటూ.. అట్టారో ఇండియా కంపెనీ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశం, చర్చలు, ఒప్పంద పత్రాలపై సంతకాలు, ఆ సంస్థ ప్రతినిధులను తాను చేసిన సత్కారానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు కేటీఆర్.. ఇక, ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా.. పరోక్షంగా చాలా మంది ఉపాధి లభిస్తుందంటూ రాసుకొచ్చారు. కాగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు క్యూ కడుతోన్న విషయం తెలిసిందే.
Happy to announce that @AtteroIndia will be investing Rs 600 Crores to establish a a new facility in Telangana
Also Read
The proposed facility will provide direct employment to more than 300 people and indirect employment to many more pic.twitter.com/qaxbTlHapf
— KTR (@KTRBRS) October 31, 2022
Read Also: Munugode bypoll: రేపే మునుగోడులో ప్రచారానికి తెర.. ఔటర్స్ ఖాళీ చేయాల్సిందే..
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!