Off The Record: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ ప్రసంగిస్తారు.అయితే గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక ఈ మధ్య కాలంలో గవర్నర్‌కు, రాష్ట్ర సర్కార్‌కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇద్దరి మధ్య విమర్శల తీవ్రత కూడా అంతే స్థాయిలో ఉంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రసంగంపై కుదిరిన సయోధ్యతో…
Off The Record: అచ్చంపేట బీఆర్ఎస్లో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా రాజకీయం నడుస్తోంది. తమ రాజకీయ ప్రయాణానికి అడుగడుగునా స్పీడ్ బ్రేకర్‌గా మారిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టార్గెట్‌గా ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ పావులు కదుపుతున్నారు. నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తూ… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలవడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. దీంతో అచ్చంపేట గులాబీ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ పీఠం… అచ్చంపేట నియోజకవర్గ…
గుడ్ బడ్జెట్.. మా నాలుగు సూచనలు కేంద్రం పాటించింది.. లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24పై సంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది గుడ్ బడ్జెట్.. అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు.. అయితే, ప్రీ బడ్జెట్లో మేం చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు…
తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల బిజీలో పడింది. సమయం దగ్గర పడుతుండటంతో.. పార్టీని సమరానికి సిద్ధం చేసే పనిలో పడ్డారు నాయకులు. ఎన్నికల కోసమే కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్‌లకు వ్యూహకర్తగా ఉన్నారు సునీల్ కనుగోలు. అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహన్ని ఆయన పార్టీకి అందజేశారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలాబలాలు తదితర అంశాలపై నేరుగా కాంగ్రెస్ హైకమాండ్‌కే ఆయన రిపోర్ట్ ఇచ్చారట. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉందని ఆయన తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. ఈ…
శ్రీవారిపై కాసుల వర్షం.. జనవరిలోనూ ఆ మార్క్ దాటింది.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత…
పెట్టుబడులతో రండీ.. ఏపీ మిగతా రాష్ట్రాల కంటే భిన్నమైనది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రండి.. మా వంతు సహకారం అందిస్తాం అని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఈ సమావేశంలో వివిధ దేశాల దౌత్యాధికారులు,…