గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో విదేశీ పెట్టుబడులు ఒక్కపైసా రాలేదు..! విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టింది.. ఈ మేరకు ఆయా సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది.. అయితే, జీఐఎస్‌పై విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. శ్రీ సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెలో ఒక్క పైసా కూడా విదేశీ పెట్టుబడి రాలేదని ఆరోపించారు..…
TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.. దక్షిణ భారతదేశం నుండి మేఘా ఇంజినీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన Olectra Greentech Limitedకి మొత్తం 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌ను అందజేసింది. పెద్ద ఎత్తున క్లీన్, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కలిగి ఉండే దిశగా తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ కోసం ఈ ఆర్డర్ ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. 50 ఇంటర్సిటీ…
కర్నూలులో భూప్రకంపనలు.. ఇళ్లు, సీసీ రోడ్డుకు బీటలు.. ఆంధ్రప్రదేశ్‌లో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో భూ కంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.. టర్కీలో సంభవించిన భూకంపంతో భారీ ఆస్తి, ప్రాణనష్టం జరిగింది.. ఆ తర్వాత వరుసగా భూకంపాలు వస్తూనే ఉన్నాయి.. టర్కీలో భూకంపం తర్వాత భారత్‌లోనూ పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూప్రకంపనల కలకలం రేపుతున్నాయి.. తుగ్గలి మండలం రాతనలో భూప్రకంపనలు వచ్చాయంటున్నారు స్థానికులు.. ఒక్కసారిగా భూ ప్రకంపనలు…
రాజన్న సిరిసిల్ల జిల్లా కళికోట సూరమ్మ ప్రాజెక్టును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. నిలిచిపోయిన పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కోసం హడావుడిగా హరీష్ రావు శంఖుస్థాపన చేశారని స్థానికులు తెలిపారు.