Heat Wave Alert: ఈ నాలుగు రోజులు మండే ఎండలు.. ఐఎండీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heat Wave Alert: తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. మొదటి రెండ్రోజులు రాష్ట్రంలోని సగం జిల్లాల్లోనే ప్రభావం ఉంటుందని అందులో పేర్కొంది.
ఆ తర్వాతి రెండ్రోజులు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ 4 రోజులు 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. సోమవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది. ఆ తర్వాత వాతావరణం చల్లబడుతుందని, మళ్లీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read Also: Summer Effect: ఏపీలో నేడు, రేపు వడగాల్పులు ..వాతావరణ శాఖ వార్నింగ్
నల్గొండ జిల్లా పెద్దఅడిశెర్లపల్లి మండలం ఘనపూర్‌లో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 41.7, ఆసిఫాబాద్‌లోని జంబుగ, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 41.6, నల్గొండ జిల్లా కట్టంగూర్‌లో 41.5, నిజామాబాద్ నార్త్‌లో 41.4, పెద్దపల్లి జిల్లా ఈసల తక్కళ్లపల్లి, భద్రాద్రి జిల్లా నాయుడుపేటలో 41.3, వికారాబాద్ జిల్లా నాగారంలో 41.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!