CM KCR: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. ఈ మేరకు యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం సోమవారం కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, అవసరమైన ఏర్పాట్లు, కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌కు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే ఈసారి ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నింటిని ప్రారంభించి, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొనుగోళ్ల విషయంలో సోమవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధికారులకు కొనుగోళ్లకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేయనున్నారు.
Read Also: RGI Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాల రద్దు.. ఆందోళనలో ప్రయాణికులు
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ఇప్పటికే పలు జిల్లాల్లో యాసంగి వరి కోతలు మొదలైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. గతంలో మాదిరిగానే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట దళారులకు విక్రయించి మోసపోకుండా మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఖాతాల్లో జమచేస్తోంది. ఈ సారి గ్రేడ్ వన్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ధరను ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: Telangana Government : జీవో నెం.4 ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖకు వర్తించదు
ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో సుమారు 1.30 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 80-90 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. అంతకు మించి వచ్చినా సరే కొనుగోలు చేసేందుకు అధికారులు సకల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. రైతులు తమ ధాన్యం విక్రయించిన వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కేంద్రంలోనూ అవసరమైన టార్పాలిన్లు, ధాన్యం తూర్పారపట్టే యంత్రాలు, హమాలీలు, గోనె సంచులు ఇలా అన్ని రకాల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే కాంటా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!