ఏపీలో ఉధృతంగా పిడుగులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త..! ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. అయితే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లోని ప్రజలు.. మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట ప్రాంతాల ప్రజలు..…
తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలే ఇందకు కారణమని చెప్పొచ్చు.. కర్ణాటక జోష్ ను తెలంగాణలోనూ కొనసాగించాలని ఏఐసీసీ భావిస్తుంది. ఇందుకోసం వ్యూహాలను సిద్ధం చేస్తుంది. ఇందుకోసం చర్చించేందుకు ఎల్లుండి ( ఈ నెల 26న ) ఢిల్లీ రావాలని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఆ పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు ఉద్యోగాలు, కార్లు ఇప్పిస్తానని నిందితులు పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సెటిల్మెంట్ల కోసం హైదరాబాద్లో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి రామ్ కార్యాలయం తెరిచాడు.
Group-1 Prelims: గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గత ఏడాది అక్టోబర్లో నిర్వహించిన పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఫలితాల అనంతరం రద్దు చేశారు.
Off The Record: చొప్పదండి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది… పేరుకు ఎస్సీ రిజర్వుడ్ కానీ రాజకీయాలు మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి… ఇక్కడ బలమైన రెండు సామాజిక వర్గాలదే హవా… గతంలో ఎమ్మెల్యేగా ఉన్న బొడిగె శోభ వైఖరికి వ్యతిరేకంగా మండల స్థాయి నేతలు ఒక్కటయ్యారు. దీంతో ఆమెకు సీటు రాకుండా పోయింది. అదే గ్రూప్ నేతలు… స్థానికుడంటూ సుంకె రవిశంకర్ను ప్రోత్సహించి టికెట్ వచ్చేలా చేశారు… గెలిచేంత వరకు బాగానే ఉంది… తర్వాత ఏడాదిన్నరలోనే…
విద్యార్థులకు శుభవార్త.. రేపే ఆ మొత్తం ఖాతాల్లో జమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులకు శుభవార్త చెప్పారు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న సీఎం.. రేపు జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమచేయనున్నారు.. అయితే, ఇప్పుటికే రెండో సార్లు సీఎం జగన్ కొవ్వూరు పర్యటన వాయిదా పడింది.. గత నెల 14న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో ‘వలంటీర్లకు వందనం’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రోడ్ షో,…
రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు.. ఎండల ఎఫెక్ట్ అలా ఉంది మరి..! రాత్రి నుంచి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. .కానీ, ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఉపసమనం కోసం వైన్ షాపులకు పరిగెడుతున్నారు మందుబాబులు. బీరు తాగి వేసవి తాపం నుంచి ఉపశమనం పొండుతున్నారు. ఫలితంగా మద్య అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో పక్షం రోజుల్లో 35 లక్షల కాటన్లు ఖాళీ అయ్యాయి. ఈ నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో బీర్లు అమ్మకాలు జరిగాయి. 18…