Peoples Leader Bhatti: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 100 రోజులకు చేరింది.. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెళ్లివిరుస్తోంది. భట్టి విక్రమార్క పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్ పాడు గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. కేతేపల్లి ప్రజలు భట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.. మరోవైపు.. #PeoplesLeaderBhatti అనే హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది..
Read Also: Government Jobs: నిరుద్యోగులకు మరో శుభవార్త.. 1,827 కొత్త పోస్టులు
పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల దగ్గరకు వెళ్తూ.. సమస్యలు తెలుసుకుంటూ.. తమ ప్రభుత్వంలో ఏ సమస్య లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తూ ముందుకు సాగుతోన్న భట్టి విక్రమార్కకు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు నీరాజనం పడుతున్నారు.. జననేతకు శుభాకాంక్షలు చెబుతూ.. #PeoplesLeaderBhatti, #PeopelsMarch100Days హాష్ ట్యాగ్‌లను జోడిస్తున్నారు.. దీంతో, ఈ రెండు హాష్ ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి రాగా.. #PeoplesLeaderBhatti హాష్ ట్యాగ్ మాత్రం ట్రాప్ ట్రెడింగ్‌లోకి వచ్చింది.. ఓవైపు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్‌లను, విభేదాలను పరిష్కరించే దిశగా భట్టి పాదయాత్ర సాగుతోందని.. యువతతో పాటు.. సీనియర్లను, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను కూడా సమన్వయం చేస్తూ భట్టి ఒకే వేదికపైకి తెస్తున్నారని పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.