పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న బూపల్లి స్పందనను చూడడానికి వచ్చిన తండ్రి బూపల్లి విజయ్ కు గుండె పోటు రావడంతో హాస్పిటల్ తరలిస్తుండగా రైల్వే గేట్ పడింది. దీంతో అంబులెన్స్ లోనే గుండె నొప్పి భరించలేక అతడు విలవిలవిల్లాడిపోయాడు. అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేస్తూ అతడిని కాపాడేందుకు ట్రై చేశారు. కానీ రైలు వెళ్లిపోయి గేటు ఎత్తే సమయానికి అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో చనిపోయాడు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో బీజేపీ హైకమాండ్ ఫుల్ నజర్ పెట్టింది. ఇప్పటికే పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేసిన బీజేపీ పార్టీ ఇక జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ( శుక్రవారం ) ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లాలో పర్యటించగా.. రేపు బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ జేపీ నడ్డా హైదరాబాద్ కు వస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన వానా పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణ గూడలో వర్షం కురుస్తుంది. అయితే.. మరో రెండు గంటల పాటు నగరంలో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ( శనివారం) మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారికి సాదర స్వాగతం పలికారు.
ఎంఐఎం పార్టీకి చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. బార్కాస్ సలాల లో ఇవాళ (శనివారం) ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాటి ఘటనలో క్షతగాత్రుడిగా ఉన్న తనను ప్రాణాలకు తెగించి కాపాడిన ఎమ్మెల్యే బలాల, మజ్లీస్ కార్యకర్తలకు ఊపిరున్నంత వరకు రుణపడి ఉంటానన్నారు.
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి క్లూస్ టీం విచారణ ముగిసింది. బీబీనగర్‌లో రైల్వే స్టేషన్‌కు వచ్చిన క్లూస్ టీమ్ మంటల్లో కాలిపోయిన బోగీలను తనిఖీ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే బోగీల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. సైంటిఫిక్ నివేదిక తర్వాతే అసలు వివరాలు చెబుతామని అధికారులు చెప్పారు.