చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ మధ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి డబ్బు సంచులతో స్థానిక నాయకులను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ఆరోపించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి చేష్టలు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Read Also: peanuts: పల్లీలతో ఇన్ని లాభాలా..! రోజుకు గుప్పెడు తినండి..
ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలి అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షతను కించపరిచినట్లేనని ఆయన అన్నారు. నియోజకవర్గం మీద.. స్థానిక నాయకుల మీద సోయి లేని నువ్వు నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తవా అంటూ ముత్తిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Shabbir Ali: కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది.. మీలా మోసం చేయదు..
రెండు సార్లు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా స్వంత ఖర్చులతో భోజనాలు పెట్టీ నిన్ను గెలిపించిన.. కానీ 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అని చెప్పడం సిగ్గు చేటు అంటూ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. కబర్ధార్ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. నీ డబ్బు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు అని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నా.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నియోజకవర్గంలో ఎక్కడ కబ్జా చేసిండో నిరూపిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆయన పేర్కొన్నాడు.