తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను ఊపేసిన వర్షం ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి..…
నా కంటే పెద్ద హిందూ ఎవ్వడు లేడనే కేసీఆర్ కి ఈరోజు సనాతన ధర్మం మీద చేస్తున్న దాడులు కనపడట్లేవా అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా మండి పడ్డారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శేర్లింగంపల్లిలో కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాలుగో ( సెప్టెంబర్ 7 ) రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 333 దరఖాస్తులు వచ్చినట్లు బీజేపీ తెలిపింది.
కాకతీయ యూనివర్సిటీ లో పీహెచ్డీ అడ్మిషన్స్ లో అవకతవకలు జరిగాయి అని ఎబివిపి, ఇతర బీసీ విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు
గూగుల్ రోడ్ మ్యాప్ ఓ లారీని ప్రాజెక్టు నీళ్లలోకి తీసుకెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి జలాశయం విషయంలో గూగుల్ మ్యాప్ తప్పుదారి చూపించి ప్రమాదంలో నెట్టివేసింది. గుడాటిపల్లి దగ్గర నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టులో ఓ లారీ చిక్కుకోవడానికి కారణమైంది.