తెలంగాణలో ఎన్నికల కోలహలం స్టార్ట్ అయింది. రాష్ట్రంలో డిసెంబర్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగనున్నట్లు సమాచారం. దీంతో అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రముఖ ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇక, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసేందుకు ముమ్మరం చేశాయి.
Read Also: Minister Usha Sri Charan: చంద్రబాబుకు మంత్రి ఉషాశ్రీచరణ్ సవాల్
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నాలుగో ( సెప్టెంబర్ 7 ) రోజు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 333 దరఖాస్తులు వచ్చినట్లు బీజేపీ తెలిపింది. అయితే.. ఇప్పటి వరకు మొత్తం 999 అప్లికేషన్స్ వచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఇక, రాష్ట్ర కార్యాలయంలో ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు. ఆశావహుల నుంచి వస్తున్న స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు.
Read Also: Health Tips : తమలపాకుతో ఇలా చేస్తే ఆ సమస్యలు మాయం..
అయితే, ఒక్కో వ్యక్తి నాలుగు, ఐదు స్థానాలకు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. బీజేసీ ముఖ్యనేతలు, సీనియర్ల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నాలుగో రోజు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్య నేతలు ఎవరూ అప్లికేషన్ చేసుకోలేదు. దరఖాస్తు సిస్టమ్ ను బీజేపీ సీనియర్ నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఎందుకిలా అని అడిగితే.. మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నామని వారు దగ్గర నుంచి సమాధానాలు వస్తున్నాయి.
Read Also: Telangana: తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 హీట్.. పోటాపోటీగా బీజేపీ-కాంగ్రెస్ బహిరంగ సభలు
కాగా, ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావహుల నుంచి వస్తున్న దరఖాస్తులపై బీజేపీ ఎన్నికల ఇంఛార్జి ప్రకాశ్ జవదేకర్ ఆరా తీశారు. ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. ముఖ్య నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద నాయకుడు అయినా టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. దరఖాస్తు చేసుకోకపోతే టికెట్ ఇవ్వరా అంటూ సీనియర్లు సెటైర్లు వేస్తున్నారు.
Read Also: Bhumana Karunakar Reddy: ఆధునీకరించిన వినాయక సాగర్‌ను ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
అయితే, బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని అనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటుంది. ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఇక, దరఖాస్తుల పరిశీలన కోసం స్క్రీనింగ్ కమిటీని బీజేపీ ఏర్పాటు చేయనుంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ నెల 17 తర్వాత అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే ఛాన్స్ ఉంది.