Telangana: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు, వరదలు జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణను ఊపేసిన వర్షం ఆదివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్లీ వర్షాలు దంచికొడతాయని అధికారులు చెబుతున్నారు. గురువారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి..
కాస్త ఆగిన వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.. ముఖ్యంగా సిద్ధిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు పైన పేర్కొన్న జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది…
Also Read
గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికి పలు చోట్ల రోడ్లన్నీ నీటి మయం అయ్యాయి.. కాలు తీసి బయట పెట్టడానికి వీలు లేకుండా పోయింది.. తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. వికారాబాద్, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక హైదరాబాద్‌లో చుట్టు పక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలయాశాలు వరద నీటితో నిండిపోయాయి.. డ్యామ్ లలో నీటిని వదులుతున్నారు.. ఇక మరోసారి భారీ వర్షాలంటే జనం భయపడుతున్నారు.. ఏది ఏమైనా వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!