గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణ తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన ఆరోపించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారు.. హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే అన్నారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కోకపేటలో సగరకుల ఆత్మ గౌరవ భవన నిర్మాణ పనులకు మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని కుల వృత్తుల ఆత్మ గౌరవం పెరిగే విధంగా బిల్డింగ్స్ నిర్మాణం చేస్తున్నారు.
అప్పట్లో చంద్రబాబు ఐటి ఐటీ అనేవాడు.. పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యి ఇప్పుడు జైల్ లో ఉన్నాడు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన గురించి మాట్లాడవద్దేమో కానీ.. సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఐటీతో గ్రామాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు అంటూ పేర్కొన్నాడు.
అయితే.. నిన్న ( ఆదివారం ) ఒక్కరోజే ఏకంగా 2781 మంది మంది ఆశవాహులు అప్లయ్ చేశారు. దీంతో.. బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు సంఖ్య 6003కు చేరింది. దీంతో.. బీజేపీకి తెలంగాణలో ఫుల్ డిమాండ్ ఉంది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.