What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే.
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో భువనేశ్వరి నిరసన దీక్ష చేయనున్నారు.
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈరోజు మచిలీపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ సాగనుంది. మచిలీపట్నంలో మహాత్మా గాంధీకి పవన్ నివాళులర్పించనున్నారు. ఆపై కృష్ణాజిల్లా కార్యవర్గంతో పవన్ భేటీ కానున్నారు.
నేడు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్ రూంలను లబ్ధిదారులకు మంత్రి అందజేయనున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో నూతన రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.
Also Read: Meenakshi Chaudhary: బంఫర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేడు మెదక్ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత తొలిసారిగా మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ పర్యటించనున్నారు. మెదక్‌లో సర్వమత ప్రార్థనల్లో మైనంపల్లి పాల్గొననున్నారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు రెండు వార్మప్ మ్యాచులు జరగనున్నాయి. గుహవాటి వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఉంది. న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా మధ్య తిరువనంతపురంలో మరో మ్యాచ్ ఉంది.
- Tags
- ap
- ntv
- telangana
- whats today
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!